డ్రాగన్ పడవ పోటీలు సమర్థవంతంగా నిర్వహిస్తాం
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:07 AM
ఆత్రేయపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫి డ్రాగన్ పోటీలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి-తాడిపూడి బ్రిడ్జి వరకూ ప్రధాన కాలువలో డ్రాగన్ పడవ పోటీలకు ట్రైల్ రన్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాహుల్‌మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్
ఆత్రేయపురం ప్రధాన కాలువలో పడవ పోటీలకు ట్రైల్ రన్
ఆత్రేయపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫి డ్రాగన్ పోటీలు సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి-తాడిపూడి బ్రిడ్జి వరకూ ప్రధాన కాలువలో డ్రాగన్ పడవ పోటీలకు ట్రైల్ రన్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ రాహుల్‌మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ట్రైల్ రన్ నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 11, 12, 13 తేదీల్లో జాతీయస్థాయిలో డ్రా గన్ పడవ, స్విమ్మింగ్, రంగోలి, పతంగుల పోటీ లు చేపడతామన్నారు. సర్‌ఆర్ధర్ గోదావరి ట్రోఫి టూరిజం శాఖ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి లో ఈ పోటీలు సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఈ పోటీలకు భధ్రత కల్పించడంతో పాటు తమ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పర్యాటకులకు అనువైన ప్రదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సం దర్శకుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. లొల్ల లాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఈ ఉత్సవాలకు సంబంధించి నిర్వహకులతో పలు అంశాలపై తీసుకోవాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలపై వివరించారు. మీడి యా, కూటమి శ్రేణులతో కలిసి డ్రాగన్ పడవలపై ప్రధాన కాలువలో విహరించారు. జిల్లా కలెక్టర్ కయాకింగ్ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరరావు, అధికారులు, ట్రోఫీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.