కుక్కలకు మాత్రమే!
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:29 AM
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ముని సిపాలిటీల్లో వీధికుక్కలకు ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.
సుప్రీం ఆదేశాలతో సమాయత్తం
144 కేంద్రాలు ఏర్పాటు
తూతూమంత్రంగా ఆపరేషన్లు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని ముని సిపాలిటీల్లో వీధికుక్కలకు ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.ఆయా కార్పొరేషన్లు, ము నిసిపాలిటీల పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తిం చి కుక్కలకు ఒక చోట ఆహారం పెట్టడమే ఈ ఫీడింగ్ జోన్ల లక్ష్యం. ఇటీవల కుక్కల కార ణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు.దీంతో జనం కుక్కలపై దాడులకు తెగబ డుతున్నారు.ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు రెండు నెలల కిందట ఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధి లో 25, కాకినాడలో 25, తునిలో 6, పిఠాపు రంలో 3, సామర్లకోటలో 4, పెద్దాపురంలో 14, గొల్లప్రోలులో 3, ఏలేశ్వరంలో 20, అమలాపు రంలో 5, మండపేటలో 33, రామచంద్రపు రంలో 3, మమ్మిడివరంలో 3 జోన్లు ఏర్పాటు చేశారు. ఖాళీగా ఉండే ప్రాంతాల్లో ఈఫీడింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.అక్కడ ప్రజలతో పాటు మునిసిపాలిటీలు కుక్కలకు ఆహారం ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఏబీసీ ఆపరేషన్‌కు రూ.1500
వీధి కుక్కలు ఇష్ట్టానుసారం పెరిగిపో కుం డా వాటికి యానిమల్ బర్త్ కంట్రోలు (ఏబీసీ) ఆపరేషన్లు 2016లో ఆరంభించారు. అయితే అవి తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. 2020 నుంచి మునిసిపాలిటీలకు బాధ్యత అప్పగించినా అదే పరిస్థితి.ఒక కుక్కకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడానికి రూ.1500 ఖర్చు చేస్తున్నారు. రాజమహేంద్రవరం ముని సిపల్ రీజినల్ డైరెక్టర్ కార్యా లయం పరిధి 34 మునిసిపాలిటీల్లో 57,621 వీఽధి కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. ఇంత వరకూ 43,107 కుక్కలకు చేశారు. ఏ ఆర్‌వీ వ్యాక్సినేషన్ 55,542 కుక్కు లకు వే యాల్సి ఉందని గుర్తించి ఇప్పటి వరకూ 40,842 కుక్కలకు వ్యాక్సినేషన్ చేశారు. 14, 394 కుక్కులకు ఏబీసీ ఆపరేషన్లు, 14,700 కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంది.
ఏబీసీ ఆపరేషన్లు ఇలా..
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 15,865 కుక్క ల్లో 9972కి ఏబీసీ ఆపరేషన్లు చేశారు. 15,865 కుక్కలకు వాక్సినేషన్ చేయాల్సి ఉండగా 9972కి చేశారు. ఏలేశ్వరంలో 310కి 20 కుక్కలకే ఆపరే షన్ చేశారు.వ్యాక్సినేషన్ చేయలేదు. ముమ్మిడి వరంలో 185కి 30 ఆపరేషన్లు మాత్రమే చేశారు. తునిలో 1125కి 214 ఆపరేషన్లు, 214 వ్యాక్సి నేషన్లు చేశారు. కొవ్వూరులో 110కి ఆపరేషన్లు, 139కి వ్యాక్సినేషన్ చేయవలసి ఉండగా ఇంత వరకూ చేయలేదు. నిడదవోలులో 300కి 140 ఆప రేషన్లు,140 వ్యాక్సినేషన్లు మాత్రమే చేశారు. సామర్లకోటలో 639కి 321 ఆపరేషన్లు మాత్రమే చేశారు. పిఠాపురంలో 632కి 324 ఆపరేషన్లు, 324 వ్యాక్సినేషన్లు చేశారు. రామచంద్రపురంలో 194కి 119 మాత్రమే చేశారు. కాకినాడలో 5 వేల కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉండగా 3,560 కుక్కలకు మాత్రమే చేశారు.పెద్దాపురంలో 358కి 337కి చేశారు.మండపేటలో 544కి 525 చేశారు.గొల్లప్రోలులో 254కి 254 ఆపరేషను ్ల 254 వ్యాక్సినేషన్లు పూర్తి చేశారు.అమలాపురంలో 435కి ఆపరేషన్లు, వ్యాక్సినేషన్లు పూర్తి చేశారు.