అపచారం..
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:40 AM
తిరుమల తిరుపతి దేవ స్థానం లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరి గిన కల్తీ వ్యవహారం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీ సిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మండిపడ్డారు. ఆ పాప ప్రక్షాళనలో భాగంగా అమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవ స్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమం గురువారం నిర్వహించారు.
తిరుమల లడ్డు కల్తీ మహాపాపం
ప్రాయశ్చిత్తంగా ఆలయ శుద్ధి
లడ్డూ కల్తీ దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే ఆనందరావు డిమాండ్
అమలాపురం టౌన్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవ స్థానం లడ్డూ ప్రసాదం తయారీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరి గిన కల్తీ వ్యవహారం కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీ సిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మండిపడ్డారు. ఆ పాప ప్రక్షాళనలో భాగంగా అమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవ స్థానంలో ఆలయ శుద్ధి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చి త్తంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ‘మహా పాపం నిజం’ పేరుతో కరపత్రాలను ప్రదర్శించారు. కోట్ల సొమ్మును కాజేయడానికి పవిత్ర పుణ్యక్షేత్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి ర్యాలీ నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని మహిళలు పెద్ద ఎత్తున నినాదా లు చేశారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డును సైతం వదలకుండా కల్తీకి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అన్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ధర్మాన్ని రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నా రు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు గు త్తుల సాయి, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రా జోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గొల్లపల్లి అమూల్య, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, కూటమి నాయకు లు కంచిపల్లి అబ్బులు, చిక్కం సుధ పాల్గొన్నారు.