Share News

గిరిజనులకు నెలలో ఒకరోజు వైద్య సేవలందించండి

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:01 AM

సర్పవరం జంక్షన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత నిష్టాతులైన వైద్యులు కాకినాడ రంగరాయ వైద్యకళాశాల సొంతం. ఆర్‌ఎంసీ కాకినాడకే గర్వకారణం.. గ్రామీణ గిరి జనులకు నెలలో ఒకరోజు వైద్య సేవలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని డాక్టర్లను కోరుకుంటు న్నా అంటూ డిప్యూటీ సీఎం పవ

గిరిజనులకు నెలలో ఒకరోజు వైద్య సేవలందించండి
వేదికపై మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌

ఆర్‌ఎంసీ కాకినాడకే గర్వకారణం

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

సర్పవరం జంక్షన్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోనే అత్యంత నిష్టాతులైన వైద్యులు కాకినాడ రంగరాయ వైద్యకళాశాల సొంతం. ఆర్‌ఎంసీ కాకినాడకే గర్వకారణం.. గ్రామీణ గిరి జనులకు నెలలో ఒకరోజు వైద్య సేవలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని డాక్టర్లను కోరుకుంటు న్నా అంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (రాంకోస) రూ.10.11 కోట్ల ఆర్థిక సహకారంతో ఆధునీకరణ, పునరు ద్ధరణలో భాగంగా బయోకెమిస్ట్రీ, పరిపాలనా కా ర్యాలయాలు, లెక్చర్‌ హాల్స్‌, నర్సింగ్‌ ల్యాబ్స్‌ వం టి ఆధునిక నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ విద్యనార్జించిన వారు కళాశాల అభివృద్ధిలో భాగస్వాములవుతూ భవి ష్యత్తు తరాలకు స్పూర్తి ప్రధాతలుగా మా ర్గద ర్శకులుగా నిలుస్తున్నారు. ఈ కళాశాల వెనుక ఎంతోమంది పెద్దల కృషి ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆరోగ్యానికి భరోసా క ల్పిస్తున్నారని కితాబిచ్చారు. ఇంతటి మంచి కా ర్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలంటే ఆ లోచి ంచానని, ప్రేమతో పిలిచారని భావించి పాల్గొన డం జరిగిందన్నారు. అనంతరం జీఎస్‌ఎల్‌ మెడి కల్‌ కాలేజీ, నియో సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ డెంటల్‌ స్ర్కీనింగ్‌ వాహనాలను పవన్‌ ప్రారంభించారు. రోగులు, చిన్నారులకు డెంటల్‌ కిట్లను పంపిణీ చేశారు. మాజీ మంత్రి డాక్టర్‌, పూర్వ వైద్యవిద్యార్థి కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమాజ హితం కోసం భావితరాల వైద్యులకు మరింత మౌలిక సదుపాయాలు అందించాలన్న లక్ష్యంతో తలపెట్టిన ఈ కార్య క్రమం పవన్‌ చేతులమీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జీఎస్‌ఎల్‌ ఆసు పత్రి చైర్మన్‌, పూర్వవిద్యార్థి డాక్టర్‌ గ్రంథి భా స్కర రావు మాట్లాడుతూ ఆర్‌ఎంసీ కాలేజీ భవనం నిర్మించి సుమారు 120 ఏళ్లు దాటిందని, ఏంచేస్తే బాగుంటుందోనని సభ్యులంతా ఆలోచిం చామ న్నారు. నా వంతుగా రూ.కోటి విరాళం ఇచ్చానని, అలా పూర్వ విద్యార్థుల సౌజన్యంతో ప్రపంచం లోనే తొలిసారిగా వైద్య కళాశాల పునర్నిర్మాణం చేయడం ఓల్డ్‌ బాయ్స్‌కే దక్కిందన్నారు. కార్యక్ర మంలో రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌బాబు, శాసనమండలి ప్రభుత్వ విప్‌ పిడుగు హరి ప్రసాద్‌, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి కొండ బాబు, పంతం నానాజీ, మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కల్యాణం శివశ్రీనివాస్‌, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఎస్పీ బిందుమాధవ్‌, రాంకోస అధ్యక్షులు డాక్టర్‌ ఎం.ఆనంద్‌, డాక్టర్‌ అనూష, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌, జీజీ హె చ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్య ఉన్నారు.

Updated Date - Jan 11 , 2026 | 01:01 AM