Share News

పెట్టుబడుల..దా..ఊస్‌!

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:58 AM

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పారిశ్రామి కం గా, పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శర వేగంగా అడుగులు వేస్తోంది.

పెట్టుబడుల..దా..ఊస్‌!

సీఎం చంద్రబాబు, లోకేశ్‌ ప్రజంటేషన్లు

కాకినాడలో భారీ పరిశ్రమలకు స్వాగతం

కోనసీమలో హోంస్టే..తమారా కంపెనీకి వినతి

గోదారి అందాలు చాటేలా ఎకో టూరిజం

యు.కొత్తపల్లిలో ఏంఎంజీ మెటల్‌ ప్లాంట్‌

విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో ఉమ్మడి జిల్లా

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పారిశ్రామి కం గా, పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శర వేగంగా అడుగులు వేస్తోంది. వేల కోట్ల పెట్టుబ డులు, పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చేలా కృషి చేస్తోంది. అది విశాఖ పెట్టుబడుల సదస్సు అయినా.. దావోస్‌లో పెట్టుబడుల వేట అయినా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అనుకూలతలను వివరించి పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపా దనలను ఆయా కంపెనీల ముందుంచుతోంది. తాజా గా దావోస్‌ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ అనేక కంపెనీల ముందు ఉమ్మడి జిల్లాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి పలు ప్రతిపాదనలు ముందుంచారు.కాకినాడ సెజ్‌, పోర్టులో పెట్టుబడులతో పాటు కోనసీమలో హోం స్టేలు, గోదావరిలో ఎకో టూరిజం ప్రాజెక్టులు పరిశీ లించాలని కోరడంతో దావోస్‌లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఊసు చర్చకు వచ్చింది.

రండి.. రండి.. దయచేయండి

కాకినాడ సెజ్‌ 8 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఎన్నో ఏళ్ల కింద సేకరించిన ఈ భూముల్లో ఇప్ప టికీ సరైన భారీ పరిశ్రమల జాడే లేదు. దీంతో సెజ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేలా ప్రభు త్వం దృష్టిసారించింది. తద్వారా స్థానికులకు వేల ల్లో ఉపాధి లభించేలా శ్రద్ధ వహించింది.

ఫ దావోస్‌ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ డెన్మార్క్‌కు చెందిన పవన విద్యుత్‌ సంస్థ వెస్టాస్‌ గ్రూప్‌తో భేటీ అయ్యారు. కాకినాడ సెజ్‌లో పవన విద్యుదుత్పత్తికి వీలుగా విండ్‌ టర్బైన్‌ బ్లేడ్‌ పరిశ్రమల ఏర్పాటు చేయాలని కోరారు. నాసెల్లె ఆఫ్‌ షోర్‌ తయారీ యూనిట్‌ స్థాపించా లని ప్రతిపాదిం చారు.

ఫ కాకినాడలో ప్రస్తుతం ఏఎం గ్రీన్‌ సంస్థ రూ.13 వేల కోట్లతో గ్రీన్‌ అమ్మో నియా ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. తద్వారా విదేశాలకు గ్రీన్‌ అమ్మోనియాను ఎగుమతి చేయబోతోంది. దీనికి ఇటీవల సీఎం చంద్రబాబు, పవన్‌ శంకుస్థాపన చేశారు.ఈ నేపథ్యంలో కాకినాడపోర్టు నుంచి ఎగుమతి సదుపాయాలు వినియో గించుకుని గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రంలో పెట్టుబడులు పెట్టాలని జపాన్‌కు చెందిన రెన్యువల్‌ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్‌ సీఈవో యుకియో కానిని సీఎం చంద్రబాబు, లోకేశ్‌ కోరారు.

ఫ కాకినాడ పోర్టులో హైడ్రోజన్‌ టెర్మినల్‌ ట్రాక్టర్స్‌ పైలట్‌ వాహనాలను తయారు చేసి వినియోగించేలా కాంప్లెక్ట్‌ వెహికిల్స్‌ మొబిలిటి సిస్టం అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన ఏవో సంస్థ ముందు లోకేశ్‌ మరో ప్రతిపాదన ఉంచారు. ఇవన్నీ సాకారమైతే వేల కోట్ల పెట్టుబడులు కాకినాడకు క్యూ కట్టనున్నాయి.

ఫ ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమలో హోంస్టే ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని తమారా లీజర్‌ సీఈవో శిబులాల్‌ ముందు సీఎం చంద్రబాబు పెట్టుబడుల ప్రతిపా దనలు ఉంచారు.పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి అందాలకు పెట్టింది పేరని..తూర్పుగోదావరి జిల్లాలో ఎకో టూరిజం ప్రాజెక్టులు భారీగా ఏర్పాటు చేసే వీలుందని వివరించారు. తమ ప్రభుత్వం కంపెనీలకు అనుమతుల నుంచి స్థాపన వరకు అనుమతులిస్తామని వివరించారు.

విశాఖలోనూ పెట్టుబడులు రాబట్టారు..

గతేడాది నవంబరులో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులోనూ ఉమ్మడి జిల్లాలో పెట్టుబడుల అవకాశా లను సీఎం వివరించారు. అక్కడికక్కడే పలు ప్రోత్సాహకాలు ప్రకటించి పెట్టుబడులు రాబట్టారు. కాకినాడలో నాఫ్తా కాంప్లెక్స్‌, పాలిమర్స్‌ కంపెనీ ఏర్పాటు చేయడానికి ముం దుకు రావాలని ఎల్‌జీ కెమికల్స్‌ కంపెనీతో సీఎం చర్చలు జరిపారు. యు.కొత్తపల్లి మండలం మూల పేటలో ఈ రెండింటినీ ఏర్పాటు చేసే విషయమై పరిశీలించాలని కోరారు. ఎల్‌జీ కంపెనీ నాఫ్తా కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సానుకూలంగా స్పందిస్తే రూ.60 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. సముద్రంలో షిప్‌ క్రూయిజ్‌ నిర్వహణలో ప్రఖ్యాతి గాంచిన కోర్డెలియా క్రూయిజ్‌ కంపెనీ ప్రతినిధులతోను చర్చలు జరి పారు. కాకినాడ నుంచి విశాఖ అక్కడి నుంచి భీమిలికి షిప్‌ క్రూయిజ్‌ సర్వీసులు నడపడానికి కలిసిరావాలని కోరారు. పెట్టుబడుల సదస్సు కు ఒక రోజు ముందు కాకినాడకు మరో భారీ పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 800 ఎకరాల్లో రూ.44 వేల కోట్లతో ఏఎంజీ మెటల్‌అండ్‌ మెటీరియల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ అల్యూమినియం స్మెల్టర్‌ ఏర్పాటుకు అనుమతులు జారీ చేసింది. పిఠాపురం నియోజక వర్గం యు.కొత్తపల్లి మండలంలో ఈ కంపెనీ ఏర్పాటుకానుంది. ఈ పరిశ్రమ ద్వారా పలు ప్లాంట్లకు ఉపయోగపడే బిల్లెట్స్‌, వైర్‌రాడ్‌లు, అల్యూమినియం షీట్లు, కాయిల్స్‌ వంటివి తయారు చేస్తారు.ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌, అల్యూమినియం స్మెల్టర్‌ ప్లాంట్‌ ఏర్పాటు, దావో స్‌ పెట్టుబడులు ఫలిస్తే ఉమ్మడి జిల్లా రూపు రేఖలు పారిశ్రామికంగా, పర్యాటకంగా మారిపోనున్నాయి.పారిశ్రామిక, పర్యాటకాభివృద్ధికి ఇప్పటి కే ఉమ్మడి జిల్లాను ప్రభుత్వం విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో చేర్చింది.

Updated Date - Jan 23 , 2026 | 12:58 AM