తండ్రి మరణం.. కూతురి శోకం!
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:46 AM
కె.గంగవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తండ్రి మరణించగా కూతురు శోకంతో అంత్య క్రియలు నిర్వహించింది.. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ఇరిగేష
కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె
కె.గంగవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): తండ్రి మరణించగా కూతురు శోకంతో అంత్య క్రియలు నిర్వహించింది.. డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ఇరిగేషన్ కార్యా లయంలో కన్జర్వెన్సీ గుమస్తాగా పేకేటి సత్య నారాయణ (కాంతారావు) (60) పనిచేస్తు న్నా రు. శుక్రవారం ఆయన విధుల్లో ఉండగా గుండెపోటు వచ్చింది. కాకినాడలో ఓ ఆసుప త్రికి తరలించగా శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. కుమారులు లేకపోవడంతో ఒక కుమార్తె కోటిపల్లి రేవులో అంత్యక్రియలు నిర్వహించిం ది. కాంతారావుకు కోటిపల్లి ఇరిగేషన్ ఏఈ రెహమాన్, గుమస్తా రాజు నివాళులర్పించారు.