Share News

దాబాలా..బార్‌లా!

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:12 AM

సిట్టింగ్‌ ఎక్కడ బాగుం టుంది.. ఏదైనా దాబా కెళ్లిపోదాం.. ఎందుకంటే అక్కడ ముక్క ఉం టుంది.. చుక్కా ఉంటుంది.. అడిగిన వెంటనే ఇస్తారు.. ఆఖరున బిల్లు తీసుకుంటారు..

దాబాలా..బార్‌లా!
నిడదవోలులోని ఒకదాబాలో సిట్టింగ్‌

ముక్కతో పాటు చుక్క సరఫరా

యథేచ్ఛగా సాగుతున్న వైనం

జిల్లా వ్యాప్తంగా 50 దాబాలు

కన్నెత్తిచూడని అధికారులు

యజమానుల ఇష్టారాజ్యం

నిడదవోలు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : సిట్టింగ్‌ ఎక్కడ బాగుం టుంది.. ఏదైనా దాబా కెళ్లిపోదాం.. ఎందుకంటే అక్కడ ముక్క ఉం టుంది.. చుక్కా ఉంటుంది.. అడిగిన వెంటనే ఇస్తారు.. ఆఖరున బిల్లు తీసుకుంటారు.. ప్రస్తుతం జిల్లాలో దాబాల సంఖ్య పెరుగుతుంది. మారుమూల ప్రాంతాల్లో అత్యధికంగా వెలుస్తు న్నాయి..ఇక్కడకు వచ్చి ఎవడు తింటాడురా అనుకుంటే మోసపోయి నట్టే.. పగలంతా ఈగలు తోలుకుంటారు.. రాత్ర యితే మాత్రం కుర్చీకి పోటీ పడాల్సిందే. ఎం దుకంటే ప్రస్తుతం దాబాలు బార్‌లలా మారి పోతున్నాయి. అయినా పట్టించుకునే నాథుడు లేదు..కన్నెత్తి చూసే అధికారీ లేడు.

బార్లను మించి సిట్టింగ్‌ ఏర్పాట్లు

జిల్లాలో దాబాల సంస్కృతి ఊపందుకుంది. చాలా దాబాల్లో బార్లను మించి మందుబాబుల కు ప్రత్యేక సిట్టింగ్‌ ఏర్పాట్లు ఉంటున్నాయి. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం శివారు నుంచి జిల్లా శివారు ప్రాంతమైన నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామం వరకు దా బాలు పెరిగాయి. రాజమహేంద్రవరంలో దివా న్‌ చెరువు, లాలాచెరువు, రాజానగరం, కొవ్వూ రు మండలంలో కొవ్వూరు, కాపవరం, దొమ్మే రు, మద్దూరు, చాగల్లు మండలం పంగిడి, బ్రాహ్మణగూడెం, నిడదవోలు మండలం కాట కోటేశ్వరం, గోపవరం, విజ్జేశ్వరం, దేవరపల్లి మండలంలోని హైవే అనుకుని నల్లజర్ల వరకు సుమారు 50 వరకూ దాబాలు ఉన్నాయి. ఈ దాబాల్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధం గా వెలిసినవే. ఆయా దాబాల్లో మద్యం ఏరులై పారు తుంది. అయినా అడ్డూ అదుపు లేదు. జిల్లాలోని కొన్ని దాబాలకు మాత్రమే అను మతులు ఉండగా వారు నిబంధనలను పాటి స్తున్నారు. ఎక్కువ శాతం దాబాలు మందు బాబులే టార్గెట్‌గా నడిపిస్తున్నారు.

అనుమతిలేకున్నా దర్జాగా?

జిల్లాలోని మునిసిపాలిటీ పరిధిలో ఒక బార్‌ లైసెన్స్‌ ఫీజు ఏడాదికి సుమారుగా రూ.35 లక్ష లు. అలాగే ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మాత్రమే బార్‌లకు అను మతి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్‌లను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నిబంధనలు పాటిం చాల్సిందే.. అదే దాబాలకు అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఫీజులు చెల్లించక్కర్లేదు. ఎలాంటి నిబంధనలు పాటించక్కర్లేదు. రాత్రి ఒంటి గం టైనా మందుబాబులు తాగొచ్చు. మందు బాబు లకు ప్రత్యేకంగా పరదా కట్టి వారు తాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ దాబా రెస్టా రెంట్లలో చాలా వాటికి అనుమతుల్లేవు. కొన్ని దాబాలు మాత్రమే స్థలాలను లీజుకు తీసుకుని ఏర్పాటు చేయగా చాలా చోట్ల ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసినవే. నిడదవోలు మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ నీటిపారుదల శాఖ భూమిలో ఏర్పాటు చేసింది కావడం విశేషం. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉంటే ఉన్నతాధికారులు రాత్రి సమయాల్లో ఒకసారి చూడాల్సిందే మరి.

Updated Date - Jan 20 , 2026 | 01:12 AM