రేపు రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:09 AM
కోరుకొండ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పందాలు జరగనున్నాయి. ఈ మేరకు గాడాల- నిడిగట్ల మార్గంలో 2కిలోమీటర్ల రోడ్డును సిద్ధం చేశారు. ఎస్ డీఆర్ వెంచర్ సంక్రాంతి సంబరాల్లో భాగం గా మొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబం
కోరుకొండ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామంలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పందాలు జరగనున్నాయి. ఈ మేరకు గాడాల- నిడిగట్ల మార్గంలో 2కిలోమీటర్ల రోడ్డును సిద్ధం చేశారు. ఎస్ డీఆర్ వెంచర్ సంక్రాంతి సంబరాల్లో భాగం గా మొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ వివరాలను గ్రామస్తుల పక్షాన రైతు నాయకుడు శనివారపు ధనరాజు మీడియాకు వివరించారు. గాడాల గ్రా మస్తుల సహకారంతో పార్టీలు, కులమతాలక తీతంగా ఈనెల 4న ఆదివారం ఉదయం 7 గం టల నుంచి సాయంత్రం వరకు పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీనియర్, జూనియర్ విభాగాలుగా నిర్వహించామన్నారు. సీనియర్ విభాగంలో మొదటి బహుమతి గాబజాబ్ పల్సర్ (125సీసీ)బైక్, రెండో బహుమతిగా రూ.40 వేల నగదు, మూడో బహుమతిగా రూ. 30వేల నగదు అందిస్తామన్నారు. జూనియర్ విభాగం లో మొదటి బహుమతి టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ (100సీసీ), రెండో బహుమతిగా రూ.30వేల నగదు, మూడో బహుమతిగా రూ.20వేలు, నా ల్గో బహుమతిగా రూ.15వేలు, ఐదో బహుమతి గా రూ.10 వేలు, ఆరో బహుమతిగా రూ.8వేలు, ఏడో బహుమతిగా రూ.6వేలు, 8వ బహుమతిగా రూ.5వేలు నగదు అందజేయనున్నట్టు తె లిపారు. పోటీలు తిలకించేందుకు ప్రజలందరూ తరలిరావాలని ఆయన కోరారు. వారి కోసం మంచినీరు, మజ్జిగ, భోజన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో పడాల పండు, అడ్డగర్ల జగన్, ధర్నాల దొరబాబు, కూటి కోటేశ్వరరావు, వేములూరి కాపు, జక్కంపూడి సత్యనారాయణ, మాగారపు సత్యనారాయణ, గంగిశె ట్టి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.