Share News

మారదా..గోదారి!

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:12 AM

కాటన్‌ బ్యారేజీ లేని గోదావరి జిల్లాలను ఊహించగలమా..? కష్టమే.. ఆ బ్యారేజీ లేకపోతే ఐదు జిల్లాల్లో లక్షలాది ఎకరాలు బీడువారతాయి.. చెరువులు ఎండిపోతాయి.. గొంతులు తడారిపోతాయి..

మారదా..గోదారి!

కాటన్‌ బ్యారేజీకి రూ.146 కోట్లు

డిసెంబర్‌లో టెండర్లు..ఎందుకో జాప్యం

117 గేట్లు మార్చాలని సీడబ్ల్యుసీ హెచ్చరిక

పట్టించుకోని వైసీపీ.. కూటమి చొరవతో నిధులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

కాటన్‌ బ్యారేజీ లేని గోదావరి జిల్లాలను ఊహించగలమా..? కష్టమే.. ఆ బ్యారేజీ లేకపోతే ఐదు జిల్లాల్లో లక్షలాది ఎకరాలు బీడువారతాయి.. చెరువులు ఎండిపోతాయి.. గొంతులు తడారిపోతాయి.. అయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం.. 2022లో 117 గేట్లు మార్చాలని సీడబ్లుసీ నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు.. ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు పరిశీలించి సమస్యను విన్నవించినా.. ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపినా గాలి కొదిలేశారు.. కూటమి ప్రభుత్వంలో రూ.146 కోట్లు నిధులు మంజూరు చేయిం చినా నేటికీ పనులు ఆరంభం కాలేదు.. బ్యారేజీపై ఎందుకో ఈ చిన్నచూపు అర్ధం కావడంలేదు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి పూర్వ వైభవం తేవాలని ప్రభు త్వం నిర్ణయించి.. నిధులు కేటాయించినా.. ఇప్పటి వరకూ ప్రగతి కనిపించడం లేదు. ఈ వేసవిలోనే పనులు ఆరంభిస్తే బ్యారేజీ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ టెండర్ల ప్రక్రియలో కదలిక లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో బ్యారేజీ నిర్వహణ గాలికొదిలేయడంతో మర మ్మతులకు గురైం ది. ఢిల్లీలోని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యుసీ) 2022లో స్వయంగా పరిశీలించి తక్షణం బ్యారేజీకి మరమ్మతులు చేయక పోతే సమస్య ఉత్పన్నమవుతుందని అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తర్వాత ప్రపంచ బ్యాంక్‌ నిపుణుల బృందం బ్యారేజీ పరిశీలించి 175 గేట్లకు 117 గేట్లు కొత్తవి అమర్చాలని సూచించినా పట్టింపేలేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయించినా ఎందుకో గోదావరి దారిలో మార్పులేదు.

146 కోట్లు నిధులు

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికా రంలోకి రాగానే బ్యారే జీని డ్యామ్‌ రిహేబిటేషన్‌ అండ్‌ ఇంఫ్రూమెంట్‌ ప్రోగ్రాం(డ్రిప్‌)లో పెట్టారు. మొత్తం రూ.150 కోట్లతో ప్రతిపాద నలు పంపగా.. రూ.146 కోట్లకు అనుమతి ఇచ్చి శాంక్షన్‌ చేశారు. దీంతో బ్యారే జికి మంచిరోజులొచ్చాయని సంబరపడ్డారు. డిసెం బర్‌లో టెండర్ల ప్రక్రియ ఆరంభమైనా ఎందుకో నత్తనడక నడుస్తోంది. ఽధవళేశ్వరం నుంచి విజ్జేశ్వరం వర కూ 7 కి.మీ పొడవున బ్యారేజికి 175 ఫ్లడ్‌ గేట్లు, 22 స్లూయిజ్‌లు కలిసి మొత్తం 197 ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో వరద ఉధృతి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజిని తాకుతోంది. అనంతరం 175 గేట్ల ద్వారా అంబేద్కర్‌ కోనసీమ జిల్లా గుండా సముద్రంలోకి కలుస్తోంది. ప్రతి ఏటా వేలాది క్యూసెక్కుల నీరు బ్యారేజి గుండా వెళుతుంది. ఇలా ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృథాగా పోతోంది.గత ప్రభుత్వం అసలు బ్యారేజీని పట్టించుకోకపోవడంతో చాలా గేట్లు నిర్వహణ కష్టమ వుతోంది. ఆపరేట్‌ చేసే సమయంలో అవి మొరాయిస్తున్నాయి.

నాడు ప్రతిపాదనలు పంపినా గాలికే..

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలో తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్‌ కోన సీమ, పశ్చిమగోదావరి,ఏలూరు జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు బ్యారే జి వల్లే నీరు అందుతుంది. 2 కోట్ల మంది ప్రజలకు మంచినీరు,పలు పరిశ్రమల అవసరాలు,చేపలు చెరువులకు నీరిస్తోంది. ఈ బ్యారేజి మొదట 1852లో నిర్మిం చారు. 1862-67 నుంచి 1936 వరకు ఎత్తు పెంచుకుంటూ వచ్చారు.1970లో కొత్త బ్యారేజి పనులు ఆరంభించి 1982లో గోదావరి మీద ధవళేశ్వరం విజ్జేశ్వరం మధ్య 7 కిలోమీటర్ల పొడవున బ్యారేజి నిర్మించారు. దానికి కాటన్‌ బ్యారేజి అని పేరు పెట్టారు.బ్యారేజి రాక ముందు గోదావరి నీరంతా సముద్రంలోకి పోయేది. పొలా లన్నీ బీళ్లుగా ఉండేవి. బ్యారేజీ నిర్మాణం తరువాత గోదావరి జిల్లాలు సస్యశ్యా మలంగా మారాయి.ఇంత ప్రాధాన్యత ఉన్నా గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. సీడబ్యుసీ నిపుణులు 117 గేట్లు మార్చేయాలని చెప్పినా పట్టించుకోలేదు.ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపినా గాలికొదిలేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ఆరంభించాలని రైతాంగం కోరుతున్నారు.

Updated Date - Jan 30 , 2026 | 01:12 AM