మీ భూమి..నా బాధ్యత!
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:02 AM
చంద్ర బాబుకు జనం నీరాజనం పలికారు.. జై చంద్రబాబు నినా దాలతో హోరెత్తించారు..
ఐదు గంటల పాటు పర్యటన
అడుగడుగునా నీరాజనం
ఇద్దరు రైతులకు పాస్ పుస్తకాలు
చేలోకి వెళ్లి పరిశీలించిన సీఎం
నాయకులకు దిశానిర్దేశం
మండపేట/రాయవరం/అనపర్తి,జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : చంద్ర బాబుకు జనం నీరాజనం పలికారు.. జై చంద్రబాబు నినా దాలతో హోరెత్తించారు.. తమ ఆకాంక్షలకు ఆశల రూపం ఇచ్చిన సీఎంకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదా వరి జిల్లాలో విలీనం చేసిన తర్వాత తొలిసారి విచ్చేసిన సీఎంకు అభినందనలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరం గ్రామంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరి గిన మీ భూమి - మీహక్కు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. ఇక మీ భూమిని ఎవడూ కబ్జా చేయలేడు. మీ భూమి - మీ హక్కు అత్యాధుని కమైన బ్లాక్ చైన్ టెక్నాలజీ పాసు పుస్త కాలు రూపొంది స్తున్నాం. ఒక తప్పు కూడా లేకుండా మీకు అందిస్తాం అని చెప్పారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముందుతరాల బంగారు భవిష్యత్‌కు పోరాడిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రైతాంగం,ప్రజానీకం ఇబ్బందులు పడ్డారన్నారు. 2027 నాటికి రెవెన్యూ సమస్య ల్లేకుండా చేయడమే కూట మి ప్రభుత్వ లక్ష్కమని చెప్పారు. సీఎం చంద్రబాబు రాకతో పది రోజుల ముందే మండపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి వచ్చిందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కోనసీమ జిల్లా నుంచి తమ అభ్యర్థనను మన్నించి రాజమహేంద్రవరం జిల్లాలో కలిపినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై నుంచి రాయవరం గ్రామాభివృద్ధికి రూ.2.5 కోట్లను విడుదల చేయాలని సీఎంను కోరగా ఆయన వెంటనే నిధులు విడుదల చేశారు. జేసీ మేఘ స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో 158 గ్రామాల్లో 1.18 లక్షలు పాస్ పుస్తకాలు పరీశీలించి ఈ నెల 2 నుంచి రైతులకు అందజేస్తున్నామన్నారు. రాయవరంలో మీ భూమి- మీ హక్కు సావనీర్ సీఎం ఆవిష్కరించారు. సీఎం చేతులు మీదుగా వీరంశెట్టి రాముడు(వెదురుపాక), మహిళారైతు చంద్రమళ్ల కుమారి (రాయవరం)లకు పాస్‌పుస్తకాలు అందజేశారు.సీఎం చంద్రబాబు పర్యటన రాయవరంలో శుక్రవారం ఐదు గంటల పాటు కొనసాగింది. ఉదయం 11 గంటలకు రావాల్సిన చంద్రబాబు 12.15 గంటలకు రాయవరం చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఉండవల్లికి బయలు దేరి వెళ్లారు. సీఎంకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జోన్-2 కో ఆర్డినేటర్ సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గిడ్డి సత్యనారాయణ,బండారు సత్యానందరావు, దేవ వరప్రసాద్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,మద్దిపాటి వెంకట్రాజు,అయితాబత్తులు ఆనందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ పేరాబత్తుల,ఎంపీలు హరీష్‌మాధుర్, సానా సతీష్, వేగుళ్ల లీలాకృష్ణ, రెడ్డిప్రసాద్,వేగుళ్ల అజయ్‌బాబు స్వాగతం పలికారు.
అడుగడుగునా తనిఖీలు..
పోలీసులు భారీ బందోస్తు నిర్వహించారు. పోలీసులు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరిలో విలీనమైనప్పటికీ పోలీస్ శాఖ ప్రస్తుతం కోనసీమ నిర్వహణలో ఉండడంతో ఇటు తూర్పు అటు కోనసీమ ఎస్పీలు నరసింహ కిశోర్, రాహుల్ మీనా ఏర్పాట్లు పర్యవేక్షించా రు.10 మంది డీఎస్పీలు, 16 మంది సీఐలు,30 మంది ఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు మరో 400 మంది ప్రత్యేక పోలీసులు సీఎం ప్రత్యేక ప్రొటోకాల్ అధికారి రవి, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
పొలం పరిశీలించిన చంద్రబాబు
చంద్రబాబు కార్ వాన్‌పై రాయవరం-రామవరం రోడ్డులో ఉన్న కంటిపూడి సాయిబాబా పొలాన్ని పరిశీలించి కొద్దిసేపు మాట్లాడారు. ఈ భూమి నీదేనా.. ఏం చదు వుకున్నావ్.. ధాన్యం డబ్బులు ఎంతకాలానికి జమ య్యాయి అని రైతును ప్రశ్నించగా అవును సార్ 3.33 ఎకరాలు నాదే. బీఎస్సీ బీఈడీ చదివా..వ్యవసాయం ఇష్టం.ధాన్యం డబ్బులు 24 గంటల్లోపు జమయ్యాయని రైతు సమాధానం ఇచ్చాడు. అనంతరం పొలాన్ని రోవర్‌తో సర్వే చేసిన తీరును సర్వేయర్లు కల్యాణి, మాధురి సీఎంకు వివరించారు. పాస్‌బుక్ రైతులకు ఏవిధంగా అందజేస్తున్నారని వీఆర్వో శైలజని ప్రశ్నించగా పట్టాదారు పాస్‌పుస్తకంపై క్యూఆర్ స్కాన్ చేస్తే సర్వే నెం.. ఎల్పీఎం,దారి ఏ విధంగా అన్నది కనిపిస్తుందని..వీఆర్‌వో లాగిన్ ద్వారా గ్రామం, ఆధార్ నెంబరు ఎంటర్ చేశాక బయోమెట్రిక్ లేదా ఐరిస్ ఆప్షన్ ఎంచుకుని సబ్‌మిట్ చేసి పుస్తకం జారీ చేస్తున్నామని వీఆర్‌వో తెలిపారు.
ప్రభల తీర్థాలు..శివరూపాలు చెప్పిన సీఎం
రాజమహేంద్రవరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : కోన సీమ ప్రభలతీర్థం జగ్గన్న తోటను రాష్ట్ర పండువగా చేస్తూ కేబినెట్‌తో తీర్మానించినట్టు చంద్రబాబు చెప్పారు. జగ్గన్న తోట నుంచి ప్రభలతో వచ్చిన అక్కడి ప్రజలకు చంద్ర బాబు అభినందనలు తెలిపారు. పండితులు వేద మంత్రా లతో ఆశీస్సులు ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ 400పైగా ఏళ్ల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం.. కేవలం పండుగ కాదు అన్నారు. జగ్గన్నతోటలో శివుని పదకొండు రూపాలైన ఏకాదశ రుద్రులు.. ఒకేచోట దర్శనం దేశంలోనే అరుదు.11 రూపాలైన 11 పురాతన శైవ ఆలయాల నుంచి వచ్చే ప్రభలు ఒకే వేదిక మీద కొలువు తీరడం ఈ తీర్థం ప్రత్యేకత.ఇదొక వారసత్వం అన్నారు.