Share News

ఏపీ పచ్చగా ఉండాలని..

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:51 AM

గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్‌, గ్రీన్‌ మోలిక్యులర్స్‌. గ్రీన్‌ ఎనర్టీ అంటే ప్రపంచమంతా కాకినాడ వైపు చూస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఒక ప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజ ల కోరిక మేరకు ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ద్వారా గ్రే అమ్మోనియా తయారీ ప్రోత్సహించగా..

ఏపీ పచ్చగా ఉండాలని..
ప్లాంట్‌ శంకుస్థాపన సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, ఎంపీలు ఉదయ్‌ శ్రీనివాస్‌, సానా సతీష్‌, ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీ తదితరులు

ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

కాకినాడ అమ్మోనియం హబ్‌

వైభవంగా ప్రభల తీర్థం

సంస్కృతిని కొనసాగిస్తాం

టెక్నాలజీకి ప్రోత్సాహం

కర్బన ఉద్గారాలతో తీరం కోత

రూ.15,600 కోట్ల పెట్టుబడి

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్‌, గ్రీన్‌ మోలిక్యులర్స్‌. గ్రీన్‌ ఎనర్టీ అంటే ప్రపంచమంతా కాకినాడ వైపు చూస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఒక ప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజ ల కోరిక మేరకు ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ద్వారా గ్రే అమ్మోనియా తయారీ ప్రోత్సహించగా.. ఇప్పుడు గ్రీన్‌ అమ్మోనియా దిశగా అడుగులు పడడం ఓ చరిత్ర అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడలో శనివారం ఏఎం గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్లాంట్‌కు కాంక్రీట్‌ మిషన్‌ స్విచ్ఛాన్‌ చేసి శం కుస్థాపన చేశారు. అనంతరం 3డీ మోడల్‌ ప్లాంట్‌ నమూనా పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. సీఎం చం ద్రబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏఎం కంపెనీ చైర్మన్‌ చలమలశెట్టి అనిల్‌,మరో భాగస్వామి కొల్లి మహేష్‌ కలిసి గ్రీన్‌ అమ్మోనియా ప్లాం ట్‌ ను కొత్త ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నా రని కొనియాడారు. 2027 జూన్‌ నాటికి ఇక్కడ ప్లాంట్‌ ద్వారా మొదటి విడత ఉత్పత్తి పక్రియ ప్రారంభించనున్నారన్నారు. చరిత్ర తిరగరాయడంలో తెలుగువారు ముందుండడం అభినందనీయం అని కొనియాడారు. ప్రపంచం మొత్తం బొగ్గు, చమురు, గ్యాస్‌ వనరులపైనే ఆధారపడి ఉన్నాయని, దీని వల్ల పర్యావరణానికి హాని కలుగుతోందని, సముద్రంలో మార్పులు చోటు చేసుకుని తీరప్రాంతం కోతకు గురవుతుంద న్నారు. 2016లో తాను సీఎంగా ఉన్నప్పుడు చల మలశెట్టి అనిల్‌ పంప్‌డ్‌ స్టోరేజీ ప్లాంటు అను మతికి వచ్చారని, సూపర్‌ ఐడియా అని అను మతిచ్చి ప్రోత్సహించానని గుర్తు చేశారు. మధ్య లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదు ర్కొన్నా తట్టుకుని నిలబడడం వల్లనే అనిల్‌ విజేత కాగలిగాడన్నారు.ప్రస్తుతం నిర్మిస్తున్న అమ్మోనియా ప్లాంట్‌ నిర్మాణానికి ప్రపంచంలో అత్యుత్తమైన వారిని తీసుకున్నారని కొనియా డారు. కాకినాడలో ఈ కంపెనీ రెండు గిగ్‌వాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయనుందన్నారు. గ్రీన్‌ కో ఇక్కడ 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడిగా పెట్లాలనే పెద్ద ఆలోచనతో ఉందన్నారు. 2029- 30కి అనిల్‌ పెద్ద ప్లాన్‌ చెప్పారన్నారు. కాకినాడ హోప్‌ఐలాండ్‌లో శాటిలైట్‌ లాంఛింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనిల్‌ సిద్ధమని తనకు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ , అమ్మోనియం తయారీకి ఏఏం గ్రీన్‌ ముందుకు రావడంతో ఎక్కువగా ఆనం దంగా ఉండే వ్యకి పవన్‌కల్యాణ్‌ అని సీఎం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ మాట్లాడుతూ గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ శంకుస్థాపనకు రావడం ఆనందంగా ఉందన్నారు. అనిల్‌ గురించి చాలా ఏళ్లగా తెలు సని..చేతిలో డబ్బులు లేకపోయినా ఏదో సాధించాలనే సంకల్పంతో ముందుకెళ్లారని కొనియాడా రు. కాకినాడలో పుట్టి పెరిగి ఈ స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు.495 ఎకరాల్లో 1.50 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటవుతోందని.. తద్వా రా కాకినాడకు రూ.15,600 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లయిందన్నారు. ఎరువులు,విద్యుత్‌ త యారీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్‌ఎనర్జీ, గ్రీన్‌ అమ్మోనియా దోహదం చేస్తాయన్నారు. పిఠాపురం ప్రాంతంలో సముద్రం తరచూ ముం దుకు వచ్చి తీవ్ర నష్టం జరుగుతోందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వలనే ఇలా జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు కొండ బాబు, పంతం నానాజీ, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తులు రాజశేఖరం, కలెక్టర్‌ అపూర్వభరత్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు.

ఇది నా కమిట్‌మెంట్‌..

నేను వచ్చే హెలికాప్టర్‌ మొరాయించింది.. రావడం ఆలస్యమవుతుండడంతో వర్చువల్‌గా శంకుస్థాపన చేయ వచ్చు.. కానీ చారిత్రక కార్యక్రమం కావడంతో హెలికాప్టర్‌ తెప్పించుకుని వచ్చా. ఇది తమ కమిట్‌మెంట్‌ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

గోదావరి జిల్లాల్లో సరదాగా సంక్రాంతి

గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ సరదాగా సాగింది.. జగ్గన్నతోట ప్రభల తీర్థ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సంప్రదాయాలు, సంస్కృతిని గుర్తు చేయడానికి ఈ విధంగా ఉత్సవాలు జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే టెక్నాలజీని తీసుకొస్తు న్నాం అని వివరించారు. రోడ్లు అన్నీ బాగు చేస్తున్నామన్నారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యేల పేర్లను పలుకుతూ ఇద్దరూ వెంకటేశ్వరరావులే అని చమత్కరించారు.

Updated Date - Jan 18 , 2026 | 12:51 AM