Share News

చింతూరుకు చింతలేదిక..

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:26 AM

చింతూరు డివిజను కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అను మతి మంజూరు చేసింది. ఈ మేరకు రూ.33. 94 కోట్ల అంచనా వ్యయంతో చింతూరు సామా జిక ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తూ సోమ వారం ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ను ంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదే

చింతూరుకు చింతలేదిక..
చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం

చింతూరుకు వంద పడకల ఆసుపత్రి

మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

అంచనా వ్యయం రూ.33.94 కోట్లు

అదనంగా 56 పోస్టుల నియామకానికి అనుమతి

పోలవరం జిల్లాలో ఇది రెండో వంద పడకల ఆసుపత్రి

రోగులకు తప్పనున్న ఇబ్బందులు

( చింతూరు - ఆంరఽధజ్యోతి )

చింతూరు డివిజను కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అను మతి మంజూరు చేసింది. ఈ మేరకు రూ.33. 94 కోట్ల అంచనా వ్యయంతో చింతూరు సామా జిక ఆరోగ్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తూ సోమ వారం ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ను ంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. అదే దశలో అదనంగా 56 పోస్టుల మంజూరుకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో సింహభాగం పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేయనున్న పోస్టులే కావడంతో త్వరితగతిన ఆయా పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రమైన రంప చోడవరం (పోలవరం)లో ఇప్పటికే వంద పడ కల ఆసుపత్రి ఉండగా జిల్లాలో రెండో డివిజను గా ఉన్న చింతూరులో కూడా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతులు మంజూరు కావడంతో పోలవరం జిల్లాలో ఇది రెండో వంద పడకల ఆసుపత్రిగా నమోదు కానుంది. విభ జన తరువాత చింతూరులో సామాజిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో వ్యాధిగ్రస్తులకు వైద్య సేవ లు అందుతున్నాయి. ఇక్కడి వైద్య స్థాయి దాటి న పరిస్థితి ఏర్పడిన పక్షంలో రంపచోడవరం, రాజమండ్రి లేదా తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రులకు తరలించడం జరుగు తుంది. కాగా సరిహద్దునున్న ఒడిస్సా, ఛత్తీస్‌ గడ్‌కు చెందిన వ్యాధిగ్రస్థులు కూడా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందు తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఆరోగ్య పరి స్థితి విషమించినవారిని ఇతర ప్రాంతాలకు ప్ర ధానంగా రంపచోడవరం, రాజమండ్రి తరలిం చాల్సి రావడంతో ఘాట్‌ రోడ్‌ ఓ పెద్ద సమస్యగా మారింది. దీంతో మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో చింతూరులో వంద పడకల ఆసు పత్రి ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి అనుమతులు మంజూరు చేయడం ఈ ప్రాంత ప్రజలకు శుభపరిణామంగా మారింది. గతేడాది జనవరి (2025) నుంచి డిసెంబరు వరకు చిం తూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 55,631 మంది ఔట్‌ పేషెంట్సు, 10586 ఇన్‌ పేషెంట్సు వైద్య సేవలు పొందినట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నారు. అదే దశలో 1,24,566 మంది వ్యాధి పీడితులు రక్త పరీక్షలు చేయించుకోగా, 9706 మంది ఎక్ష్‌రే సేవలు పొందారు. ఇక 825 ప్రస వాలు జరిగాయి. ఇకపై వంద పడకల ఆసు పత్రిగా అప్‌గ్రేడ్‌ అవనున్నందున ఈ ప్రాంత ప్రజలకు మరింతగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రథమంలో చిం తూరులో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయ గా కాలక్రమంలో భవన సదుపాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం 50 పడకల ఆసుపత్రి స్థాయి సేవలు అందిస్తున్నారు. కాగా గదులు, బెడ్సు సరిపడినంత లేకపోవడంతో వ్యా ధిగ్రస్తులు కిక్కిరిసిపోయి ఉంటున్న సందర్భాలు ఉంటున్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్రబలిన సమయాల్లో ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్స అం దించాల్సి వస్తోంది. ఇక ప్రత్యేక వైద్య నిపుణుల కు ప్రత్యేక గదులు లేకపోవడంతో ఒకే గదిని ముగ్గురు వైద్యులకు కేటాయించాల్సి రావడం, అక్కడనే వైద్య పరీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపై ఈ సమస్యకు చెక్‌ పడనుంది.

Updated Date - Jan 20 , 2026 | 12:26 AM