తీసుకో‘మనీ’!
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:00 AM
ఉమ్మడి జిల్లాల్లో వివిధ బ్యాంకుల్లో జనం డబ్బు కోట్లలో మూలుగుతోంది. పదే ళ్లకుపైగా ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదు..ఇలా పేరుకుపోయిన డబ్బు రూ.224.68 కోట్లు.
బ్యాంకుల్లో పేరుకుపోయిన రూ.224.68 కోట్లు
వెనక్కు తీసుకోవాలంటూ 3 నెలలుగా క్యాంపెయిన్
పదేళ్లకుపైగా లావాదేవీలు లేని ఖాతాదారులకు ఫోన్లు
ఇప్పటి వరకు వెనక్కు తీసుకున్న మొత్తం రూ.11 కోట్లే
బ్యాంకుల్లో మూలుగుతున్న రూ.213.68 కోట్లు
తలపట్టుకుంటున్న బ్యాంకు అధికారులు
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి జిల్లాల్లో వివిధ బ్యాంకుల్లో జనం డబ్బు కోట్లలో మూలుగుతోంది. పదే ళ్లకుపైగా ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదు..ఇలా పేరుకుపోయిన డబ్బు రూ.224.68 కోట్లు.ఆ డబ్బు తీసుకోండంటూ బ్యాంకులు బతి మాలుతున్నా వారెవరు ముందుకు రావడం లేదు. ప్రత్యేక క్యాం పెయిన్ నిర్వహించి మూడు నెలలుగా వెం టపడుతున్నా తీసుకుంది కేవలం రూ.11 కోట్లే. తాజాగా లెక్క తేల్చిన అధికారులు మిగిలిన ఖాతాల విషయంలో ఏంచేయాలో పాలుపోక తలపట్టుకుంటున్నారు. అటు ప్రభుత్వానికి సంబంధించి రూ.13.60 కోట్లు పేరుకు పోగా వీటికీ స్పందన లేకపోవ డంతో ట్రెజరీ ద్వారా ఆయా కార్యాలయా లకు లేఖలు పంపుతున్నారు.కంపెనీ లు,సం స్థలడబ్బు రూ.42.73 కోట్లు ఉండిపోయింది.
రూ.11 కోట్లే తీసుకున్నారు
ఆయా బ్యాంకులు ఖాతాదారులకు వారీగా ఫోన్లు చేయ డం, చిరునా మాలను సంప్రదించడం చేపట్టాయి.వచ్చి ఖాతా బతికించుకుని లావాదేవీలు చేపట్టాలని కోరాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుములు విధించ డం లేదని వివరించాయి. దీంతో కేవలం రూ.11 కోట్లకు సంబంధించిన ఖాతాలు మాత్రమే తిరిగి పునరుద్ధరణ జరిగింది. ఇందులో కాకినాడ జిల్లాలో రూ.5.50కోట్లు, కోన సీమ జిల్లాలో రూ.4.30 కోట్లు, తూ.గో.లో రూ.1.20 కోట్లు మాత్రమే జనం డబ్బు తీసుకున్నారు. ప్రత్యేక క్యాంపె యిన్ గడువు ముగిసినా ఖాతాలను బతికించు కునేం దుకు నిరంతరం అవకాశం ఉంటుందని లీడ్‌బ్యాంకు అధికారులు వివరించారు.సంబంధిత బ్యాంకుకు ఎప్పుడె ళ్లినా ఖాతా పునరుద్ధరించుకునే వీలుందని తెలిపారు.
పట్టని ఖాతాలు
బ్యాంకు ఖాతా ఉండి, అందులో పదేళ్లుగా ఏమాత్రం లావాదేవీలు నిర్వహించని వారి వివ రాలను కొంత కాలం కిందట రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గుర్తించింది. అటువంటి ఖాతా లను తిరిగి బతికించుకుని లావాదేవీలు నిర్వ హించుకునే వెసులుబాటు ఖాతాదారులకు కల్పించింది. ఆయా బ్యాంకులకు వివరాలు పం పించి ఖాతాదారులను సంప్రదించాలని ఆదేశిం చింది.ఈ మేరకు అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు మూడు నెలల పాటు ప్రత్యేక క్యాం పెయిన్ నిర్వహించారు. అయినా ఏ మాత్రం కదలిక లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఆయా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లావాదేవీలు జరగని వివరాలు సిద్ధం చేసింది. పదేళ్లకుపైగా ఖాతాలు నిర్వహించని అకౌంట్లు, అందులో డబ్బు వివరాలతో నివేదిక తయారు చేసింది.
కాకినాడ జిల్లాలో 101.22 కోట్లు
కాకినాడ జిల్లాలో మొత్తం ఖాతాలు 5,88,521 ఖాతాల్లో రూ.101.22 కోట్ల డబ్బు పేరుకు పోయింది. ఇందులో వివిధ వ్యక్తులకు సంబంధించి 5,72,938 బ్యాంకు ఖాతాల్లో రూ. 83.36 కోట్లు పదేళ్లగా లావాదేవీలు లేకుండా ఉండిపోయింది. వివిధ కంపెనీలు, ప్రైవేటు సంస్థలకు సంబంధించి 10,048 ఖాతాల్లో రూ.12.60 కోట్లు, ప్రభుత్వానికి సంబంధించి 5,535 బ్యాంకు అకౌంట్లలో రూ.5.26 కోట్లు మూలుగుతుంది.
కోనసీమ జిల్లాలో 82.66 కోట్లు
కోనసీమ జిల్లాలో 4,70,690 బ్యాంకు అకౌంట్లలో రూ.82.66 కోట్లు ఉండిపోయిందని గుర్తిం చారు. 4,58,644 వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో రూ.66.27 కోట్లు, వివిధ సంస్థలు, పరి శ్రమలకు సంబంధించి 6,984 ఖాతాల్లో రూ.12.26 కోట్లు, ప్రభుత్వానికి సంబంధించి 5,062 ఖాతాల్లో రూ.4.13 కోట్లు ఉండిపోయాయి. ఇవీ ఎవరూ తీసుకోవడంలేదు. ప్రస్తుతం మొత్తం సొమ్ము బ్యాంకుల్లో మూలుగుతోంది.
తూర్పున రూ.97.12 కోట్లు
తూర్పుగోదావరి జిల్లాలో 5,34,948 అకౌంట్లలో రూ.97.12 కోట్లు ఉండిపోయింది.5,09,614 వ్యక్తిగత ఖాతాల్లో ఉండి పో యిన మొత్తం రూ.75.05 కోట్లు. వివిధ సంస్థలు, పరిశ్రమ లకు సంబంధించి 20,180 ఖాతాల్లో రూ.17.87 కోట్లు, 5,154 ఖాతాల్లో ప్రభుత్వ డబ్బు రూ.4.21 కోట్లు పేరుకుపోయింది. పదేళ్లకు పైగా చాలా ఖాతాల్లో లావాదేవీలు జరగడంలేదు. ఖాతాదారులకు సమాచారమిచ్చినా స్పందించడంలేదు.
ఎవరివి 213.68 కోట్లు
ఇంకా రూ.213.68 కోట్లు మూలుగుతున్న నేప థ్యంలో రిజర్వు బ్యాంకుకు తాజా వివరాలతో నివేదిక పంపించారు.అలాగే పలు కంపె నీలు, సంస్థలు ఆయా చిరునామాల్లో లేకపోవడం, ఖాతాదారుల ఫోన్ నెంబర్లు మారిపోవడంతో ఆయా అకౌంట్లను పునరుద్ధరిం చడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వఖా తాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా లో రూ.13.60 కోట్లు మూలుగుతున్నట్టు గుర్తించగా, వాటినీ తీసుకోవడం లేదు.ఇవి ఎక్కువగా ఎంపీ డీవో లు,సర్పంచ్‌ల పేరుతో ఉన్నట్టు గుర్తించా రు. వీటిని తీసుకుని ఖాతాను పునరుద్ధరిం చాలంటూ ఆయా ట్రెజరీ కార్యాలయాల ద్వారా సంబంధిత విభా గాలకు లేఖలు పంపాలని నిర్ణయించారు.