Share News

78 బస్సులపై కేసులు

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:40 AM

సంక్రాంతి పండుగ రోజుల్లో టికెట్ల ధరలు పెంచిన 78 ట్రావె ల్‌ బస్సులపై కేసులు నమోదుచేసి రూ. 7.80 లక్షల అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.

78 బస్సులపై కేసులు

అమలాపురం టౌన్‌/రావులపాలెం, జనవరి19 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ రోజుల్లో టికెట్ల ధరలు పెంచిన 78 ట్రావె ల్‌ బస్సులపై కేసులు నమోదుచేసి రూ. 7.80 లక్షల అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఈనెల 9 నుంచి 18వ తేదీ వరకూ చూస్తే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 128 కేసులు నమోదుచేసి రూ.12,38,700 అప రాధ రుసుము విధించామన్నారు. రాష్ట్రం లో అత్యధికంగా ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల పై కేసులు నమోదులో కోనసీమ జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. రోడ్డు పన్ను చెల్లించకుండా కాకినాడ నుంచి బెంగళూ రు వెళ్లే ఒక బస్‌ను సీజ్‌ చేశామన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 01:40 AM