వెళ్లొస్తాం!
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:53 AM
అమలాపురం/రాజమహేంద్రవరం/ఆత్రే యపురం/రావుపాలెం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ మధుర క్షణాల ను గుర్తు పెట్టుకుని.. బరువెక్కిన హృదయాలతో లక్షల మంది ప్రజలు జిల్లా నలుమూలల నుంచి మళ్లీ నగరాలు, పట్టణాల బాట పట్టా రు. సంక్రాంతి పండు గను పురస్కరించు
బరువెక్కిన హృదయాలతో వలస బాట
ముగిసిన సంక్రాంతి సందడి
చుట్టాల తిరుగు ప్రయాణం
ఖాళీ అవుతున్న పల్లెలు
బస్‌లు, రైళ్లు రద్దీ
ప్రైవేట్ బస్‌లు దోపిడీ
సాగనంపుతున్న బంధువులు
అమలాపురం/రాజమహేంద్రవరం/ఆత్రే యపురం/రావుపాలెం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ మధుర క్షణాల ను గుర్తు పెట్టుకుని.. బరువెక్కిన హృదయాలతో లక్షల మంది ప్రజలు జిల్లా నలుమూలల నుంచి మళ్లీ నగరాలు, పట్టణాల బాట పట్టా రు. సంక్రాంతి పండు గను పురస్కరించుకుని నగరాలు, పట్టణాలకు చెందిన లక్షల మంది స్వగ్రామాలకు తరలివచ్చారు. గత ఐదు రోజు లుగా సంక్రాంతి ఉత్సవాల్లో కుటుంబీకులు పిల్లా పాపలతో ఎంతో సంతోషంగా గడిపారు. తమ కుటుంబీకులను బాధగా వీడుతూ మళ్లీ వలసెల్లిపోయారు. వేల సంఖ్యలో వాహనాల్లో ప్రజలు తిరుగు ప్రయాణం ఆరంభించడంతో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు కిటకిటలాడాయి.
రైళ్లు..బస్‌లు రద్దీగా..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రధాన పట్టణాల్లో ఉపాధి నిమిత్తం ఉండే వారే ఎక్కువ.శనివారం సెలవు కావ డం..సోమవారం విధులకు హాజరు కావాల్సి ఉం డడంతో చాలా మంది నగరాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యాలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలో స్లీపర్ బెర్త్‌లు రూ.3500 నుంచి రూ.4 వేలు ధర పలుకుతుండగా సీట్లు అయితే రూ.2 వేలు వరకూ ధర పలుకుతుంది. ఒక్క కోనసీమ జిల్లా నుంచే ప్రస్తుత సంక్రాంతి సీజన్‌లో 80కు పైగా ప్రై వేట్ బస్సులు నడుస్తున్నప్పటికి ప్రయాణికులకు మాత్రం ఎంత ధర చెల్లించి కొందామనుకున్న సీట్లు దొరకని పరిస్థితులు శనివారం, ఆదివారం రోజుల్లో నెలకొంది. ఆర్టీసీ బస్సులు రద్దీగా ఉండ డంతో ఇతర ప్రయాణ మార్గాల వైపు వెళ్లారు.రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లే విమాన ఛార్జీల ధరలు ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. కొంత మంది ద్విచక్రవాహనాల్లో వచ్చి పండుగ ముగించుకుని అదే వాహనాల్లో తిరుగుబాట పట్టారు. ఇప్పటికే రైల్వే ప్రత్యేక రైళ్లను, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయినప్పటికీ వాట న్నింటికీ మించి సొంత, ప్రైవేటు వాహనాల రద్దీ అధికంగా ఉంది.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి ఎలాంటి విషాదానికీ తావు లేకుండా సరదాగా సంక్రాంతి సాగడం మరిం త ఆనందాన్ని మిగిల్చింది. గోదారోళ్ల ఆప్యా యతలు, ఊసులను మూటగట్టుకొని చుట్టాలు ఇంటిదారి పట్టారు.మళ్లీ పెద్ద పండుగ వరకూ ఈ జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ క్షేమం గా వెళ్లి రండి మరి! ఆయ్!!
చార్జి పెంచితే డయల్ 92816 07001
ఈ సారి తెలంగాణ, ఆంధ్రా ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు తగ్గించాయి. ఇది ప్రైవేటు ఆప రేటర్లకు మరింత కలిసొచ్చింది. విమాన చార్జీ లతో సమానంగా వసూలు చేస్తున్నారు. టికెట్‌పై 50 శాతం అదనంగా తీసుకోడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే అంతకు మించి ఇష్టానుసారం టికెట్ ధరలు ఉంటు న్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ దోపిడీ చేస్తున్న ట్రావెల్స్ వివరాలను ఆధారాలతో సహా 92816 07001 నెంబరుకు తెలియ జేయాలని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఇప్పటికే సూచించారు.
అమావాస్య ఎఫెక్ట్
అమలాపురం రూరల్, జన వరి 17 (ఆంధ్రజ్యోతి) : అసలే ఆదివారం.. ఆపైన మౌని అమావాస్య. దీంతో సంక్రాంతి పండు గకు స్వగ్రామాలకు వచ్చిన వారు శనివారం ఉదయం నుంచి తిరుగు ప్రయాణాలు చేపట్టారు. దీంతో బస్‌లు, రైళ్లు ప్రయాణి కులతో కిక్కిరిసిపోయాయి.బస్సులో సీటు దక్కించుకునేందుకు ప్రయాణికులు ఫీట్లు చే యాల్సి వచ్చింది.అమావాస్య అయినా ఆది వా రం తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు