పద్దు పొడుపు!
ABN , Publish Date - Feb 02 , 2026 | 01:13 AM
నిర్మలమ్మ పద్దు మురిపించింది..ఉమ్మడి జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసేలా పలు ప్రోత్సాహకాలతో మెప్పించింది.
పలు రంగాలకు ఊతం
బకింగ్‌హం కెనాల్‌కు మహర్దశ
తీరంలో కొబ్బరి,గంధం చెట్లు
ఆయుష్ కేంద్రాల అప్‌గ్రేడేషన్
4 జిల్లాల్లో 15 కేంద్రాలకు లబ్ధి
పలు జలాశయాలకు నిధులు
జిల్లాకో బాలికల హాస్టల్ ఏర్పాటు
ఆదాయ పన్ను మినహాయింపుల్లేవ్
(కాకినాడ/రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)
నిర్మలమ్మ పద్దు మురిపించింది..ఉమ్మడి జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసేలా పలు ప్రోత్సాహకాలతో మెప్పించింది. తీరప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ప్రక టించడంతో సుదీర్ఘతీర రేఖ కలిగిన ఉమ్మడి జిల్లా తీర ప్రాంతానికి ప్రాధాన్యత లభించనుంది. దేశీయ జల రవా ణాలో ఆధునిక విధానాలకు పెద్దపీట వేస్తూ నిర ్ణయం తీసుకోవడంతో ఉమ్మడిజిల్లాలో బకింగ్‌హం కాలు వకు మంచిరోజులు రానున్నాయి. సరుకు రవాణా, పర్యా టకరంగ పరంగా పెనుమార్పులకు అవకాశం ఏర్పడింది. రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి చర్యలతో ఉమ్మడి జిల్లాలో మూడు రిజర్వాయర్లకు నిధులు పొంగ నున్నా యి. జిల్లాకో బాలికల హాస్టల్ ప్రకటనతో ఉమ్మడి జిల్లా కు నాలుగు దక్కనున్నాయి. ఆయుష్ కేంద్రాల అప్‌గ్రే డేషన్ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 15 కేంద్రాలకు లబ్ధి చేకూరనుంది. ఇన్ని మెరుపులున్నా వేతనజీవికి ఈ దఫా బడ్జెట్‌లో నిరాశే మిగిలింది. కొత్తగా పన్ను మినహాయిం పులేవీ లేకపోవడంతో వేతన జీవులు ఉసూరుమన్నారు.
జల రవాణా.. ఓకే..
దేశీయ జలరవాణాకు ఊతం ఇస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాల మీదుగా పయనించే బకింగ్‌హం కెనాల్‌కు మంచి రోజులు రానున్నాయి. ఒక ప్పుడు ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ కాలువ ద్వారా లక్షల టన్నుల సరుకు రవాణా కారు చౌకగా జరిగేది. కానీ ఆ తర్వాత మూలనపడిపోయింది. అయితే దీన్ని పున రుద్దరించడానికి తాజా బడ్జెట్ ద్వారా ఊతం లభించనుంది. ఇప్పటికే ఈ మార్గంలో జల రవాణా, పర్యాటక అభివృద్ధికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది నవం బరులో ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.80 కోట్లతో కాలువ అభివృద్ధికి అగుడులు వేశాయి. అయితే ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌లో జలరవాణా ప్రోత్స హించాలన్న నిర్ణయంతో మరిన్ని నిధులు రానున్నాయి. భవిష్యత్తులో అనేక రాష్ట్రాల నుంచి గోదా వరిపై బియ్యం,బండరాళ్లు, సిమెంట్,బొగ్గు రవాణా జరగడానికి ఆస్కారం ఏర్పడింది.
రిజర్వాయర్లకు కళ..
దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో చేపల అభి వృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బడ్జెట్ ప్రకటన చేయడంతో ఉమ్మడి జిల్లాలో గోదావరి, ఏలేరు, ముసురుమిల్లి తది తర వాటిలో చేపల అభివృద్ధికి నిధులు రానున్నాయి. ఇప్పటికే ఏలేరు రిజర్వాయరులో చేపల అభివృద్ధికి మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. అలాగే జిల్లాకో బాలి కల వసతి గృహం ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాకు నాలుగు వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ బాలి కల వసతి గృహాలు నడుస్తుండగా కేంద్రం కూడా జిల్లాకొకటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
తీరాన కొబ్బరి..గంధం..
తీరం వెంబడి కొబ్బరి,గంధం చెట్ల పెంప కానికి ప్రోత్సహం ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో 190 కి.మీపైగా ఉన్న తీరప్రాంతానికి చాలా ఉపయోగపడనుంది. కొత్త చెట్లు నాటేం దుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్టు ప్రక టించడంతో కొబ్బ రికి దశ తిరిగినట్లే భావించాలి. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో తీరం వెంబడి కొబ్బరి,గంధం చెట్లు భారీ గా నాటనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం తీరం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ కింద కొబ్బరి,సరుగుడు,తాటి చెట్లు నాటా లని నిర్ణయించింది.ఈ కార్యక్రమానికి నిధు లు భారీగా కేంద్రం నుంచి రానున్నాయి.
ఆయుష్‌కు..ఊపిరి
ఆయుష్‌కు పెద్దపీట వేశారు. కొత్త ఆయు ర్వేద ఆసుపత్రులతో పాటు ఇప్పటికే ఉన్న ఆయుష్ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తు న్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ఉ మ్మడి జిల్లాలో 15 వరకు ఉన్న కేం ద్రాల రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం వీటిలో ఆయుష్ డిస్పెన్సరీ కింద మం దులు, ఓపీ అమలవుతోంది. అప్‌గ్రేడేషన్ అయితే భవనాలు ఆధునికీ కరణ, మం దుల లభ్యత,ఆన్‌లైన్ ఓపీ సదుపాయాలు వస్తాయి.తాజా నిర్ణయంతో త్వరలో పం చకర్మ,యోగా అందుబాటులోకి రానుంది.
వేతనజీవికి అంతే..
ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను తగ్గింపు ఉం టుందని వేతనజీవులు ఆశగా ఎదురుచూశారు. తీరా నిర్మలమ్మ పద్దు ఉసూరుమనిపించింది. కొత్త గా పన్ను మినహాయింపులేవీ ప్రతి పాదించకపోవ డంతో వారంతా నిరాశకు గురయ్యారు. కాకపోతే విధాన పరమైన అంశాల్లో కొన్ని ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటించింది. ప్రధానంగా ఐటీఆర్1, ఐటీఆర్ 2 ఫైలింగ్‌కు జూలై 31 వరకు గడువు ప్రకటించారు. 2025లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను చట్టం 20 26 ఏప్రిల్ 1 నుంచి వాస్తవరూపం ధరించనున్నట్టు ప్రకటించారు. దీని ప్రకారం కేంద్రం గతే డాది ప్రకటించిన బడ్జెట్‌లో రూ.12 లక్షల వార్షికాదాయం వరకు ఎవరూ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించక్కర్లేదని ప్రకటించింది. దీంతో రూ.12 లక్షల వార్షికాదాయం పొందు తున్న వారికి రూ.80 వేల వరకు పన్ను పోటు తప్పింది. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు 63 వేల మందికి లబ్ధి చేకూరింది. ప్రధానంగా వీరిలో 22 వేల మందికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు వస్తోంది. వీరికి రూ.80 వేల వరకు మిగలనుంది. మిగిలిన 41 వేల మంది ఉద్యోగులకు సైతం రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.65 వేల వరకు ప్రయోజనం కలగనుంది.
ప్రజల బడ్జెట్
జలజీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీరందించేందుకు రూ.67,670 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజఘర్ మిషన్ పథకం కింద 95,692 పోస్టులు, గ్రామీణ ప్రాంతాల్లో పీఎం సడక్ యోజన పథక కింద నిర్మించే రహదారులకు రూ.19200 కోట్లు కేటాయించారు. పీఎం ఆవాస యోజన పథకం కింద నిర్మించే ఇళ్లకు రూ.5500 కోట్లు, ఇన్సూరెన్స్ స్కీమ్‌ల కింద రూ.12,200 కోట్లు, పీఎం కిసాన్ సమ్మోహన నిధి కింద రూ.63,500 కోట్లు కేటాయించారు. కోటిపల్లి- నర్సాపురం రైల్వే బడ్జెట్ నిధులు కేటాయింపుపై ఇంకా స్పష్టత రాలేదు. ముఖ్యంగా కోనసీమ జిల్లాకు రూ.1650 కోట్లతో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పథకానికి ఈ సారి బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ప్రజలు హార్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి కొనసాగించే బడ్జెట్
బడ్జెట్ అభివృద్ధి, పాలసీలు కొన సాగించే విధంగా ఉంది. అరు దైన మినరల్స్ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 5 లక్షల జనాభా ఉన్న నగరాలను మరింత అభి వృద్ధి పరుచుకోవడానికి 2టైర్, 3టైర్ సిటీల అభివృద్ధికి ప్రోత్సాహం కలు గుతుంది.కొబ్బరి, గంథం, కోకో, జీడిపప్పుకు మంచి ప్రోత్సాహం ఉంది.బొమ్మూరులో నాన్న ఎన్టీఆర్ పెట్టిన మహిళా ప్రాంగణాల మాదిరిగా జిల్లాకి మహిళా వసతిగృహం రానున్నది. ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు. జిల్లా ఆసుపత్రుల్లో ఎమర్జన్సీ కోమా సెం టర్లు ఏర్పాటు కానున్నాయి.
పురందేశ్వరి, ఎంపీ, రాజమహేంద్రవరం
పర్యాటక రంగానికి పెద్దపీట
బడ్జెట్‌లో పర్యాటక రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఇప్పటికే రూ.450 కోట్లు ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రావడంతో పాటు విశేషంగా నిధులు మంజూరవుతాయి. పోలవరం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. బడ్జెట్ చారిత్ర్మాకమైనది. ఇది దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థికశక్తిగా మార్చేదిగా ఉంది.
- దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి
ఎకానమి పరుగులు
బడ్జెట్ ఎకానమి పరుగులు పెట్టే దిశగా ఉంది. పౌరుల జీవనశైలి మారేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది.భారతదేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగనుంది. ఏపీకి అనుకూలంగా ఉంది. చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందనుంది.
- రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే అనపర్తి
ఏపీకి ప్రయోజనాలు
ఈ బడ్జెట్ ద్వారా ఏపీకి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, రైతులు, యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గింపుతో విమానయాన రంగానికి ఊతం ఇచ్చారు.
- ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్యే రాజమండ్రి
పోలవరానికి తీవ్ర అన్యాయం
పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించి అన్యాయం చేశారు. నిర్వాసితులకు పునరావాసానికి నిధులు కేటాయించకపోవడం దారుణం.రాష్ట్రానికి ప్రపంచబ్యాంకు నుంచి అప్పులతో నిధులు కేటాయింపు సిగ్గుచేటు.
- తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
వికసిత భారత్ సాధనకు బడ్జెట్ దోహదం
వికసిత భారత్ లక్ష్యసాధనను బడ్జెట్ సుగమం చేస్తుంది. ఆర్థిక, విద్య, వైద్యం, రవాణా, మౌలిక సదుపాయాలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి రంగాల్లో అభివృద్ధి మరింత వేగం పెంచడానికి బడ్జెట్ దోహదపడుతోంది. బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. - పిక్కి నాగేంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు