ఏ ఎన్నికలు వచ్చినా కూటమిదే విజయం!
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:51 AM
రాష్ట్రం లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికే విజయం త థ్యమయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పా టుపడాలని, ప్రభుత్వం అందజేస్తున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీ ఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
రాయవరంలో కార్యకర్తలతో సమావేశంలో సీఎం చంద్రబాబు
రాయవరం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికే విజయం త థ్యమయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు పా టుపడాలని, ప్రభుత్వం అందజేస్తున్న అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీ ఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాయవరంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల హామీ మేరకు మండపే టను తూర్పుగోదావరిలో కలిపా మని, గత ప్రభు త్వం చేసిన తప్పులను సరిచేస్తాన ని చెప్పానని.. చే శానన్నారు. మం డపేట టీడీపీ కం చుకోట అని, నాలుగు సార్లు జోగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.నిరంతరం ప్రజల్లో ఎవరైతే ఉంటారో, వారిని వెతుక్కుంటూ తానూ కార్యకర్తల దగ్గరకు వస్తానన్నారు.ప్రస్తుతం పార్టీ లో పనిచేసిన వారికి పదవుల పంపకంలో పెద్దపీట వేశానన్నారు. పార్టీలో ఎవరు పని చేశారో, ఎవరు చేయడం లేదో చూస్తున్నానన్నారు. ప్రజ లు మెచ్చిన అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చినట్టు చెప్పారు. రాజకీయాల్లో స్ర్టేటజీలు ఉంటాయని, వాటిని అనుసరిస్తే ఇబ్బందులు ఉండవన్నారు. 2024 ఎన్నికల కంటే ప్రస్తుతం మండపేట ని యోజకవర్గంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవ కాశాలు ఉండడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.కార్యకర్తలు తప్పు చేసినా, అజాగ్రత్తగా ఉన్నా, మళ్లీ సమస్య వస్తుందన్నారు. ఏ వ్యక్తిని నిద్రలేపి అడిగినా ఏ పార్టీకి ఓటేస్తావని అడిగితే కూటమి కే వేస్తానని చెప్పేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే జోగేశ్వరరావు గ్రాఫ్‌పైన, ప్రభుత్వంపైనా, పార్టీపైనా నియోజవర్గంలో సంతృప్తి శాతం సరిపోలడంపైనా చంద్రబాబు సంతృప్తి వ్యక్తంచేశారు. అధికారులను, పార్టీ శ్రేణులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానన్నారు.