Share News

కమనీయం.. రమణీయం.. లక్ష్మీనరసింహుడి కల్యాణం

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:54 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిని కల్యాణమాడారు. సరిగ్గా 1.56 గంటలకు (తెల్లవారితే గురువారం) రోహిణి నక్షత యుక్త వృశ్చిక లఘ్నపుష్కరాంశమందు జరిగిన ఈ పరిణయ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించారు.

కమనీయం.. రమణీయం..  లక్ష్మీనరసింహుడి కల్యాణం
శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

  • అంతర్వేది పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా వేడుక

  • తన్మయత్వంతో వీక్షించిన భక్తులు

  • ప్రభుత్వ ప్రతినిధులుగా హాజరైన రాజోలు ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఎస్పీ

అంతర్వేది, జనవరి 28(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిని కల్యాణమాడారు. సరిగ్గా 1.56 గంటలకు (తెల్లవారితే గురువారం) రోహిణి నక్షత యుక్త వృశ్చిక లఘ్నపుష్కరాంశమందు జరిగిన ఈ పరిణయ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం వేదపండితులు, అర్చకస్వాములు కల్యాణతంతు నిర్వహించారు. వేలసంఖ్యలో భక్తులు హాజరై తన్మయత్వంతో కల్యాణాన్ని వీక్షించారు. రాత్రి 11.30గంటలకు ఎదురు సన్నా హంతో కల్యాణతంతు ప్రారంభమైంది. అంతర్వేది విద్యుత్‌ అలంకరణల మధ్య రం గురంగులతో కనువిందు చేసింది. టీటీడీ, శృంగేరీపీఠం, అప్పనపల్లి, అన్నవరం దేవస్థానాలు పట్టు వసా్త్రలు సమర్పించాయి.

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బుధవారం కల్యాణ మహోత్సవ శోభతో వెల్లివిరిసిం ది. వేదమంత్రోచ్ఛారణలతో సకల దేవతల ఆశీర్వచనాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు ఉభయ దేవేరులైన భూదేవి, శ్రీదేవిని కల్యాణమాడారు. శ్రీ వైఖాసన ఆగమానుసా రం వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆలయ స్థానాచార్యులు వింజమూ రి రామరంగాచార్యులు ప్రధానర్చకులు పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, పెద్దింటి శ్రీనివాస్‌, వేదపండితులు చింతా వెంకటశాసి్త్ర సమక్షంలో అ ర్చక బృందం, పేరూరు ఉద్దండ పండితులు కల్యాణం నిర్వహించారు.

ఎదురు సన్నాహంతో శ్రీకారం

రాత్రి11.30గంటలకు ఎదురు సన్నా హంతో కల్యాణతంతు ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకా రం పశ్చిమగోదావరిజిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌, చై ర్మన్‌ రాజాకలిదిండి కుమారరామా గోపాలరాజా బహుద్దూర్‌ శ్రీవారి తరపున, అర్చకులు అమ్మ వారి తరపున వివాహకర్తలుగా వ్యవహరించా రు. ఆలయంనుంచి తొలుత స్వామిని, తర్వాత అమ్మవార్లను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, అధికారులు పల్లకిలో వేర్వేరు గా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అంత ర్వేదికి చెందిన డాక్టర్‌ పోతురాజు సూర్యవెంక టసత్యనారాయణ కుటుంబీకులు గతంలో ఇచ్చి న ఆభరణాలను అలంకరించారు. పేరూరు వేదపండితులు స్వామిని దర్శించుకున్నారు. స్వామి తలంబ్రాలను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పొలమూరి కుటుంబీకులు తీసుకొచ్చారు.

స్వామి అమ్మవార్లకు మదుపర్కాలు

కల్యాణ మహోత్సవానికి ముందు దేవస్థానం తరుపున ఆలయ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌, మొగల్తూరు రాజావారు, ఆ లయ ఫౌండర్‌, చైర్మన్‌ రాజా కలిదిండి బహుద్దూర్‌, కలెక్టర్‌ మహే్‌ష్‌కుమార్‌, జేసీ టి.నిషాం తి, అమలాపురంఆర్డీవో కె.మాధవి, ఎస్పీ రాహుల్‌మీనా, డీసీ రమేష్‌బా బు, ఏసీ సత్యనారాయ ణ, ఆలయ ఏసీ ప్రసాద్‌, బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు మదుపర్కాలు సమర్పించారు.

అద్భుతంగా విద్యుద్దీపాలంకరణలు

అంతర్వేది విద్యుత్‌ అలంకరణల మధ్య రం గురంగులతో కనువిందు చేస్తోంది. ప్రధాన కూ డళ్లలో కల్యాణ మహోత్సవాలు తిలకించేలా 12ఎల్‌ఈడీస్ర్కీన్లు ఏర్పాటు చేశారు.స్వామిఅంతరాలయం పచ్చి పూలు, పండ్లతో అలంకరించారు. అంతర్వేది తీరం భక్తులతో కిటకిటలాడింది. క్యూలైన్‌లో బారులు తీ రారు. క్షేత్రపాలకుడు పార్వతీ సమే త నీలకంఠేశ్వరస్వామి, క్షేత్రసంరక్షు డు ఆంజనేయస్వామి, స్వామివారి సోదరి గుర్రాలక్కమ్మ(అశ్వరుండిభి క), వశిష్ట ఆశ్రమ ఆలయాలను భ క్తులు సందర్శించి పూజలు చేశారు. కృష్ణాజిల్లా నుంచి వచ్చిన భక్తులు కల్యాణ మండపం వద్ద నిద్రిస్తూ కల్యాణం తిలకించారు.

బంగారు ఆభరణాలతో అలంకరణ

కల్యాణోత్సవాల్లో భాగంగా 11ఏళ్ల నుంచి స్వామివారి ప్రాచీన నగలను బ్యాంకులో ఉంచి కొత్త ఆభరణాలతో అలంకరిస్తున్నారు. కల్యాణం సమయంలో స్వామి కుందనపు కిరీటంతోపాటు వక్షస్థలం, శంఖుచక్రాలు ధరించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మిరియా ల గాంధీ దంపతులు స్వామికి బంగారు శఠగోపాన్ని, వెంకటేశ్వర హేచరీ సంస్థ నిర్వాహకులు బంగారు పంచపాత్రలు, ఉద్దరిణిలు, బిందె, పల్లెం, బంగారు ఆభరణాలు సమర్పించారు.

పట్టు వసా్త్రలు అందజేత

టీటీడీ, శృంగేరీపీఠం, అన్నవరందేవస్థానాలు పట్టు వసా్త్రలు సమర్పించాయి. అప్పనపల్లి దేవస్థానం ఫౌండర్‌ ఫ్యామిలీ, ఈవో పట్టు వసా్త్రలు తీసుకురాగా ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్దనున్న కౌంటర్‌లో రూ.200 చొప్పున వెయ్యి కల్యాణం టిక్కెట్లను సిబ్బంది విక్రయించారు. క ల్యాణోత్సవాల్లో 9రోజులపాటు 3లక్షల లడ్డూలు తయారు చేస్తున్నట్లు ఆలయ ఏసీ తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 01:54 AM