Share News

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:48 AM

నిడదవోలు, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా బంగారం, వెండి నగదు దోచేస్తున్న అంతర్‌ జిల్లాల దొంగ ను అరెస్టు చేసి భారీగా బంగారం, వెండి నగదు స్వాధీనం చేసుకున్నా మని నిడదవోలు సీఐ పీవీజీ.తిలక్‌ తెలిపారు. శనివారం తూర్పుగోదా వరి జిల్లా నిడదవోలు పోలీసు స ర్కిల్‌ కార్యాలయంలో వి

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..
నిడదవోలులో వివరాలు వెల్లడిస్తున్న సీఐ తిలక్‌

అంతర్‌ జిల్లాల దొంగ అరెస్ట్‌

రూ.19.34 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం

నిడదవోలు, జనవరి 3 (ఆంధ్ర జ్యోతి): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా బంగారం, వెండి నగదు దోచేస్తున్న అంతర్‌ జిల్లాల దొంగ ను అరెస్టు చేసి భారీగా బంగారం, వెండి నగదు స్వాధీనం చేసుకున్నా మని నిడదవోలు సీఐ పీవీజీ.తిలక్‌ తెలిపారు. శనివారం తూర్పుగోదా వరి జిల్లా నిడదవోలు పోలీసు స ర్కిల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. డిసెంబర్‌ 10న నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో కరుటూరి వెంకటరత్నం ఇంట్లో దొంగతనం జరిగింది. 223 గ్రాము ల బంగారం, 250 గ్రాముల వెండి, సుమారు రూ.3లక్షల 50వేల నగదు చోరీకి గురైనట్టు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేధించారు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటివారిపాలెనికి చెందిన చిలపనశెట్టి సన్యాసిరావు అలియాస్‌ సతీష్‌ అలియాస్‌ చిన్ని అనే పాత నిందితుడు దొంగత నానికి పాల్పడినట్టు గుర్తించారు. చిన్నిని శుక్రవారం సాయంత్రం రాజమహేం ద్రవరం మోరంపూడి జంక్షన్‌ లో అరెస్టు చేశారు. దొంగతనం చేసిన 223 గ్రాముల బం గారం, 250 గ్రాముల వెండి ప్లేటు, సుమారు రూ.లక్ష నగదు రికవరీ చేశారు. నింది తుడి నుంచి మొత్తం రూ.19. 34 లక్షల విలువైన బంగారం, వెండి నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలి పారు. గోకవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనం చేసిన హీరో ఫ్యాషన్‌ మోటార్‌ సైకి ల్‌ను కూడా స్వాధీనం చేసుకు న్నామని తెలిపారు. నిందితు డిపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు నమోదై జైలుకు కూడా వెళ్లి వచ్చాడ న్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ ్లపై రెక్కీ చేసి పగలు లేదా రాత్రిళ్లు దొంగతనం చేసి విలువైన వస్తువులను దోచుకుపోతుం టాడని తెలిపారు. దొంగతనం జరిగిన అతి తక్కువ సమయంలోనే నిందితుడిని పట్టుకుని వస్తువు లు రికవరీ చేయడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. సమావేశంలో ఉండ్రాజవరం ఎస్‌ఐ డి.రవికుమార్‌, కానిస్టేబు ళ్లు బుజ్జి, జ్యోతి బాబు, కృష్ణారావు, సాంబయ్య, రహీం, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:48 AM