లెక్కతేలింది..!
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:28 AM
అన్నవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో సంచలనం రేకెత్తించిన వ్రతపురోహిత సంఘం నిధుల స్వాహా విషయానికి సంబంధించి ఎట్టకేలకు లె క్కతేలింది. ఈవో త్రినాథరావు నియమించిన కమిటీ నివేదికను ఈవోకు అందజేసింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా అన్నవ
అన్నవరం దేవస్థానం వ్రతవిభాగంలో తేలిన నిధుల స్వాహా పంచాయితీ
రూ.57 లక్షలు సొంత ఖర్చులకు వాడుకున్న ఓ పురోహితుడు
రూ.28.50 లక్షలు ఇప్పటికే రికవరీ
మిగిలిన సొమ్ము రాబట్టేందుకు చర్యలు
అన్నవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రము ఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో సంచలనం రేకెత్తించిన వ్రతపురోహిత సంఘం నిధుల స్వాహా విషయానికి సంబంధించి ఎట్టకేలకు లె క్కతేలింది. ఈవో త్రినాథరావు నియమించిన కమిటీ నివేదికను ఈవోకు అందజేసింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థాన ంలో 240మంది వ్రతపురోహితులు వివిధ గ్రేడ్‌లలో పనిచేస్తుండగా వారందరికీ వ్రతటిక్కెట్ల విక్రయాలపై 40శాతం కమిషన్ వ్రతపురోహితులకు దేవస్థానం అందజేస్తుండగా ఈ మొత్తం పురోహి త సంఘానికి దేవస్థానం జమచేస్తుంది. ఈ మొ త్తాన్ని గ్రేడులవారీగా, పురోహితుల హాజరు ఆధా రంగా నెలనెలా వారి వ్యక్తిగత ఖాతాలకు జమ చేస్తుంటారు. ఈ వ్యవహారమంతా దీర్ఘకాలంగా ఒక పురోహితుడు నిర్వహిస్తున్నాడు. అయితే అందరిలో నమ్మశక్యంగా ఉంటూ సదరు పురోహితుడు చేతివాటం ప్రదర్శించాడు. సహచర పురోహితులు కొందరు తమ బ్యాంక్ సాలరీ స్టేట్‌మెంట్ తీసుకునే సమయంలో మహిళ పేరుతో అందులో ఒకే అకౌంట్‌కు సుమారు నెలజీతంగా రూ.83వేలు జమకావడంతో అనుమానం వచ్చి లెక్కతేల్చగా రూ.28.54 లక్షలు స్వాహా చేసినట్టు గుర్తించారు. దీంతో వ్రతవిభాగ అధికారులు, పురోహిత సంఘ పెద్దలతో చర్చించి రూ.28.54 లక్షలు వ్రతపురోహిత సంఘానికి జమ చేయించారు. అనంతరం సదరు పురోహితుడు మృతిచె ందాడు. అయితే ఈ వ్యవహారంలో మరింత లో తుగా విశ్లేషణ చేయాలని భావించి దేవదాయ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈవో త్రినాథరావు ఒక కమిటీ ఏర్పాటు చేసి గత 10ఏళ్లలో చెల్లింపులపై బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు రికార్డులు తనిఖీ చే సి నివేదిక ఇవ్వాలని తెలపడంతో కమిటీ ఈవో కు నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఈ పీఎఫ్ ఖాతాకు జమచేయాల్సిన సుమారు రూ.9 లక్షలు సొంతానికి వాడుకున్నట్టు గుర్తించారు. అ ంతేగాకుండా గత మూడేళ్ల నుంచి నిధుల మ ళ్లింపు వ్యవహారం చేసినట్టు గుర్తించి దఫదఫాలుగా మరో.20 లక్షలను నలుగురు పురోహితు లు, ముగ్గురు కుటుంబసభ్యుల ఖాతాకు మళ్లించినట్టు గుర్తించారు. దీంతో రికవరీ కావలసిన మొత్తాన్ని అధికారులు కుటుంబసభ్యులు, పురోహితులతో చర్చించి రూ.29 లక్షలను పురోహిత సంఘానికి జమచేసేందుకు ఒత్తిడి తీసుకురావడంతో వారు అంగీకరించినట్లు తెలిసింది. అయి తే ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారులు, దేవ స్థానం వ్రతవిభాగ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. బ్యాంక్ అధికారులు నిధులు సొంతానికి వాడుకున్న పురోహితుడి వ్యక్తిగత మెయిల్ నుం చి పంపించడాన్ని పరిగణలోకి తీసుకోవడం వారి తప్పిదమైతే వ్రతవిభాగ అధికారులు పరిశీలించకపోవడం దేవస్థానం తప్పిదంగా గుర్తించి వారికి ఈవో షోకాజు నోటీసులు జారీ చేశారు.