Share News

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో మెరుగుపడిన ‘అన్నవరం’

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:57 AM

అన్నవరం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ప్రధాన దేవాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వే లో అన్నవరం దేవస్థానం క్రమేపి ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంటుంది. గత ఈవో పాలన లో చివరి రెండుస్థానాల్లో ఉన్న సంగతి విధిత మే. అయితే గతనెలలో ఈ

ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో మెరుగుపడిన ‘అన్నవరం’

ర్యాంకింగ్‌లో దేవస్థానానికి మూడోస్థానం

అన్నవరం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ప్రధాన దేవాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వే లో అన్నవరం దేవస్థానం క్రమేపి ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంటుంది. గత ఈవో పాలన లో చివరి రెండుస్థానాల్లో ఉన్న సంగతి విధిత మే. అయితే గతనెలలో ఈవోగా త్రినాథరావు బాధ్యతలు స్వీకరించాక భక్తుల సౌకర్యాలపై దృష్టిపెట్టడంతో ర్యాంకింగ్‌ నెలనెలకు మెరుగుపడుతుంది. గతనెల సర్వేలో అన్నవరం నాల్గోస్థానం పొందగా మంగళవారం ఈనెల విడుదల చేసినర్యాంకింగ్‌లో మరోస్థానం మెరుగుపడి మూడోస్థానం పొందినట్టు ప్రభుత్వం గణా ంకాలు విడుదల చేసింది. మొదటిస్థానంలో ద్వారకా తిరుమల, చివరిస్థానంలో శ్రీ కాళహస్తి దేవస్థానాలు ఉన్నాయి. అంశాలవారీగా చూస్తే భక్తులకు సంతృప్తి దర్శనంలో అన్నవరం దేవస్థానం రెండోర్యాంక్‌, తాగునీరు, మౌలిక వసతు ల కల్పన, ప్రసాదం రుచికి సంబంధించిన అం శాల్లో మూడోస్థానం సాధించింది. పారిశుధ్య ని ర్వహణలో అన్నవరం ఆలయం బాగా వెనకబడి ఆరోర్యాంక్‌ పొందడం విచారించదగ్గ పరిణామం. అన్నవరం దేవస్థానానికి సంబంధించి దర్శనాల విషయంలో 68.5 శాతం, తాగునీరు మౌలిక వసతుల కల్పనలో 71.4 శాతం, ప్రసా దం నాణ్యత విషయంలో 82.3శాతం సంతృప్తి చెందగా శానిటేషన్‌ నిర్వహణ బాగాలేదని 32.9 శాతం మంది అభిప్రాయాలను వెల్లడించారు.

Updated Date - Jan 28 , 2026 | 12:57 AM