అన్నవరం.. నాల్గోస్థానం!
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:08 AM
అన్నవరం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధానాలయాల్లో భక్తులకు అందు తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలో కాకినాడ జిల్లాలోని అన్న వరం దేవస్థానం ర్యాంకింగ్ మెరుగుపడింది. ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టాక మొదట విడతలో చివరిస్థానంలో నిలిచిన అన్నవరం దేవస్థా
రాష్ట్ర ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్ సర్వేలో మెరుగుపడిన అన్నవరం దేవస్థానం ర్యాంక్
అన్నవరం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రధానాలయాల్లో భక్తులకు అందు తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలో కాకినాడ జిల్లాలోని అన్న వరం దేవస్థానం ర్యాంకింగ్ మెరుగుపడింది. ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టాక మొదట విడతలో చివరిస్థానంలో నిలిచిన అన్నవరం దేవస్థానంపై ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ దృష్టిపెట్టడంతో రెండో పర్యాయంలో రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా దేవస్థానంలో మళ్లీ పరిస్థితి యథాతదంగా ఉండి గతనెలలో ఆరో స్థా నం సాధించింది. గత ఈవో సుబ్బారావు కాలపరిమితి ముగియడంతో ఆర్జేసీ త్రినాథరావును మరోసారి ఈవోగా గతనెలలో ప్రభుత్వం నియమించింది. దీంతో అన్నవరం దేవస్థానంలో సౌకర్యాలపై త్రినాథరావు దృష్టిసారించడంతో తాజా ర్యాంకింగ్‌లో రీజినల్ జాయింట్ కమిషనర్ హో దా కలిగిన 7 ప్రధాన దేవాలయాల పరిధిలో అ న్నవరం దేవస్థానం 67.9 శాతంతో నాల్గోస్థానం సాధించింది. 71.2 శాతంతో శ్రీకాళహస్తి ప్రఽథమ స్థానం పొందింది. అన్నవరం దేవస్థానంలో దర్శ నం సంతృప్తిస్థాయి 69.9 శాతం, తాగునీరు సౌ కర్యంపై 61.9శాతం, ప్రసాదం నాణ్యతపై 78.6 శాతం, పారిశుధ్య నిర్వహణపై 63.1శాతం మం ది సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని విభాగాలను కలిపి అన్నవరం నాల్గోస్థానం పొందినట్టు దేవదాయశాఖ నివేదికను పొందుపరిచింది. నవంబరు 25 నుంచి డిసెంబరు 25 వరకు వివిధ దేవస్థానాలకు సంబంధించి 18 లక్షలమంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు.