లోటుపాట్లు సవరించండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 01:02 AM
అన్నవరం, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఒకపక్క ప్రభుత్వం ప్రతినెలా ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ ర్యాంకింగ్‌లు ప్రవేశపెడుతుండగా ఏరోజుకా రోజు అన్నవరం దేవస్థానంలో ఆయా విభాగ అధికారులు అభిప్రాయాలు తె లుసుకుని లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే సవరించేలా
అన్నవరం దేవస్థానం ఈవో త్రినాథరావు
భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరణ
అన్నవరం, జనవరి 10 (ఆంధ్ర జ్యోతి): భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఒకపక్క ప్రభుత్వం ప్రతినెలా ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ ర్యాంకింగ్‌లు ప్రవేశపెడుతుండగా ఏరోజుకా రోజు అన్నవరం దేవస్థానంలో ఆయా విభాగ అధికారులు అభిప్రాయాలు తె లుసుకుని లోటుపాట్లు ఉంటే వాటిని వెంటనే సవరించేలా కార్యచరణ రూపొందించాలని ఈవో త్రినాథరావు సూచించారు. శనివారం కాకినాడ అన్నవరం దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాన్ని భక్తులతో కలిసి ఆయన స్వీకరించారు. అంతకముందు వ్రతభక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. క్యూలైన్‌లు పరిశీలించి దర్శనం టిక్కెట్లు స్కానింగ్ విధానం తెలుసుకున్నారు. ఇచ్చిన టిక్కెట్లు మరోసారి తిరిగి వస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే తక్షణమే విదుల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. భక్తులు అడిగే సంశయాలను వెంటనే ఏ స్థాయి ఉద్యోగి అయినా నివృత్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఈవో కృష్ణారావు, పీఆర్వో అనకాపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.