గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:44 AM
సామర్లకోట, మార్చి 10 (ఆం ధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకు న్నారు. దివ్యాంగురాలికి అండగా నిలిచారు. ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్యశ్రీఫైర్‌వర్క్స్ బాణ సంచా దుకాణంలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో మృ
తండ్రిని కోల్పోయిన దివ్యాంగురాలికి జీవితాంతం సాయం
ప్రతీనెలా రూ.7,500 బ్యాంకు ఖాతాలో జమచేస్తానని ప్రకటన
సామర్లకోట, మార్చి 10 (ఆం ధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకు న్నారు. దివ్యాంగురాలికి అండగా నిలిచారు. ఇటీవల కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్యశ్రీఫైర్‌వర్క్స్ బాణ సంచా దుకాణంలో భారీ పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో మృతిచెందిన 27గురిలో తండ్రిని పోగొట్టుకున్న కడింపల్లి దుర్గ అనే మానసిక దివ్యాంగురాలి దీనస్థితిపై సోషల్ మీడియాల్లో ప్రసారమైన కథనాలకు అల్లు అర్జున్ చలించారు. దుర్గకు అండగా నిలిచారు. దుర్గ పోషణ నిమిత్తం జీవితాంతం ప్రతీనెలా రూ.7,500 చొప్పున ఆమె బ్యాంకు ఖాతాలో జమచేస్తానని అల్లు అర్జున్ ప్రకటిం చారు. ఈ మేరకు అల్లు అర్జున్ అభిమానులు వేట్లపాలెం గ్రామం చేరుకుని బాధిత కుటు ంబానికి చెందిన సభ్యులకు అల్లు అర్జున్ అం దించిన సమాచారాన్ని వివరించారు. ఆపదలో ఉన్న ఒక దివ్యాంగురాలికి అండగా నిలిచి అల్లు అర్జున్ గొప్ప మనస్సు చాటుకోవడంతో అభి మానులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు.