ఆవాస్‌మే!
ABN , Publish Date - Jan 03 , 2026 | 01:59 AM
పేదల గృహనిర్మాణ కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సొంతింటి కలను తీర్చేందుకు ఎట్టకేలకు ఆవాస్ ప్లస్ హౌసింగ్ సర్వే పూర్తిచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 79,964 మంది అర్హులను గుర్తించింది.
పేదింటి కలత తీరేలా సర్కారు అడుగులు
- ఉమ్మడి జిల్లాలో ముగిసిన సర్వే
- అర్హులను గుర్తించిన హౌసింగ్
-ప్రభుత్వానికి నివేదిక అందజేత
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుర్తింపు
- 2029 వరకు ఇదే సర్వే అమలు
- ఏఐ ద్వారా వడపోత కొనసాగింపు
సొంతిల్లు.. ఇదీ ప్రతి పేదవాడి కోరిక.. అయితే ఆ ఇంటికి ఎన్నో ఆటంకాలు.. పేదింటి కలత తీరడానికి ఎన్నో కష్టాలు.. ఆ కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆవాస్ ప్లస్ సర్వే ద్వారా అర్హులను గుర్తించింది..ఆర్థిక సాయం అందించి అందరికీ ఆవాసం కల్పించేందుకు సన్నద్ధమవుతోంది.
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
పేదల గృహనిర్మాణ కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సొంతింటి కలను తీర్చేందుకు ఎట్టకేలకు ఆవాస్ ప్లస్ హౌసింగ్ సర్వే పూర్తిచేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 79,964 మంది అర్హులను గుర్తించింది. కేవలం సొంత స్థలాలు ఉండి ఇళ్లు కావాల్సిన పేదలను మాత్రమే గతేడాది అధికారులు గుర్తించారు. ఆ తర్వాత నిబంధనలను మార్చి ప్రభుత్వం ఇటీవల సమగ్ర సర్వే నిర్వహించింది. సొంత స్థలాలు ఉన్న వారితో పాటు భూమిలేని వాళ్లు, గతంలో గృహం మంజూరై అసంపూర్తిగా నిలిపివేసిన ఇళ్ల లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకున్నారు. తద్వారా కోనసీమ జిల్లాలో 27,667, తూర్పుగోదావరి జిల్లాలో 23,676, కాకినాడ జిల్లాలో 28,621 మంది అర్హులను గుర్తించారు. డిసెంబరు 31తో గడువు ముగిసిన నేప థ్యంలో ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపారు.
సమగ్రసర్వేతో పక్కా లెక్క..
పేదలకు సొంతింటి కల సాకారం చేయడంలో భా గంగా ఇళ్లు లేని పేదలకు శాశ్వత గూడు కట్టించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సచివాలయాల ద్వారా అధికా రులు సొంతింటికి దరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు. దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉందా లేదా అనేది స్థానిక తహశీల్దార్ల ద్వారా ధ్రువీకరణ పత్రాలు తీసు కుని లెక్కలు తేల్చారు.ఈ క్రమంలో సొంత స్థలం లేని పేదలు చాలామంది ఉండడంతో ఆ వివరాలతో పాటు మళ్లీ సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అప్పట్లో స్వీకరించిన దరఖాస్తులతో పాటు మునిసిపాలిటీలు మినహా గ్రామాల్లో సొంత స్థలం లేని పేదల వివరాలు సేకరించాలని ఆదేశించింది. గత ప్రభు త్వాల ద్వారా ఇళ్లు మంజూరై నిర్మాణం చేపట్టి, ఆనక రకరకాల కారణాలతో పునాదుల స్థాయి నుంచి శ్లాబ్ స్థాయికి నిర్మించి మధ్యలో వదిలేసిన ఇళ్లను సర్వే చేయా లని సూచించింది. 2029 వరకు ఈ సర్వేనే ప్రామా ణికంగాతీసుకునేలా సమగ్రంగా ఉండాలని ఆదేశించింది.
79,964
మంది గుర్తింపు
ఉమ్మడి జిల్లాలో 79,964 మంది అర్హులను గుర్తిం చిం ది.వీటిని ఆవాస్‌ప్లస్ యాప్‌లో నమోదుచేసి ఏఐ ద్వారా వడపోత పోస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయి వడపోత పూర్తికానుంది.సర్వే సమాచారాన్ని 2029 వరకు ప్రభుత్వం వినియోగించనుంది.సర్వేలో గుర్తించినవారి కి పూర్తిస్థాయి ఇళ్లు అందించేందుకు కార్యాచరణ చేపట్టనుంది.
ఫ కోనసీమ : జిల్లాలో 27,667 మంది అర్హులుగా సర్వేలో గుర్తించారు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో 5,066 మందిని అర్హులుగా గుర్తించగా ఉప్పలగుప్తం మండలంలో 1,777 మంది తేలారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 5,596 మందిని గుర్తించారు.వీరిలో కాట్రేనికోన మండలంలో 2,264 మంది ఉన్నారు.రాజోలు నియోజక వర్గం లో 3,694 మంది,పి.గన్నవరం 4,531, కొత్తపేట 5,301, మండపేట 1,644, రామచంద్రపురం 1,835 మంది అర్హులు.
ఫ తూర్పుగోదావరి : జిల్లాలో 23,676 మంది అర్హులు. దేవరపల్లి మండలంలో 2,605,గోపాలపురం 2,403, కోరు కొండ 1,583, బిక్కవోలు 1,039, నల్లజర్ల 3,124, పెరవలి 906, రాజానగరం 2,907,రంగంపేట 1,576, సీతానగరం 1,073, రాజమండ్రి రూరల్ 970 మందిని గుర్తించారు.
ఫ కాకినాడ : జిల్లాలో 28,621 మందిని తేల్చారు. జగ్గంపేట 2,556, కిర్లంపూడి 1,724, రౌతులపూడి 2 వేలు, తాళ్లరేవు 2,395, తొండంగి 1,835, యు.కొత్తపల్లి 1,234, ఏలేశ్వరం 1,335, శంఖవరం 1,391, సామర్లకోట 960, ప్రత్తిపాడు 1,573, పిఠాపురం 1,280, పెద్దాపురం 1153, కరప 801, కాకినాడ రూరల్ 885, కాజులూరు 982, పెదపూడి 654, తుని 1,769 చొప్పున సర్వేలో గుర్తించారు.
ఆవాస్ ప్లస్ ఎందుకంటే..
గృహనిర్మాణ శాఖ అధికారులు గత కొన్ని నెలలుగా ఆవాస్ ప్లస్ పేరుతో సమగ్రసర్వే చేపట్టి డిసెంబరు 31నాటికి పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 79.964 మందిని గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. వీరికి త్వరలో ఇళ్ల నిర్మాణ సాయం కింద కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల వాటా కింద రూ.2.50 లక్షల వరకు సాయం అందించనున్నారు. సొంత స్థలాల్లేని వారికి స్థలం కేటాయించి ఆర్థికసాయం చేయనున్నారు. మధ్యలో నిలిచిపోయున ఇళ్లు తిరిగి ప్రారంభించేలా గతంలో వారు ఇంటి నిర్మాణానికి ప్రభు త్వసాయం ఎంత తీసుకున్నారో..ఆ మొత్తం మినహా యించి మిగిలింది మంజూరు చేస్తారు. సేకరించిన వివరాలను ఏఐ ద్వారా కూడా వడపోత పోస్తున్నారు.