విమానాలు ఫుల్!
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:56 AM
సంక్రాంతి పండుగ ముగిసింది. ఎక్కడి వారు అక్కడికి తిరుగుముఖం పట్టారు. దీంతో ఎటు చూసినా ప్రయాణరద్దీ కనిపిస్తూనే ఉం ది.
అప్పటి వరకూ న్యూఢిల్లీ సర్వీసు రద్దు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పండుగ ముగిసింది. ఎక్కడి వారు అక్కడికి తిరుగుముఖం పట్టారు. దీంతో ఎటు చూసినా ప్రయాణరద్దీ కనిపిస్తూనే ఉం ది. విమాన సర్వీసుల్లోనూ సంక్రాంతి పండగ జోష్ పెరిగింది. పండగ ముందు వివిధ ప్రాం తాల నుంచి రాజమండ్రి వచ్చే విమానాలన్నీ హౌస్‌ఫుల్ కాగా ప్రస్తుతం పండగ తర్వాత ఈ నెల 21 వరకూ మొత్తం హౌస్ ఫుల్ అయ్యాయి. 25వ తేదీ వరకూ కేవలం పదుల సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయి. ఇవి కూడా రేపో మాపో బుక్కయి పోతాయని అధికారులు చెబుతున్నారు. ముంబయి విమా నం వారానికి మూడు రోజులే కావడంతో అది మినహా మిగతా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీకి రాజమండ్రి నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య 700 వరకూ ఉంది. ముంబయి సర్వీసు ఉన్న రోజున మరో 180 మంది అదనంగా పెరుగుతున్నారు.తిరుపతికి వెళ్లే విమానం కూడా రద్దీగానే ఉంటుంది. డిసెంబర్‌లో రద్దు చేసిన ఇండిగో ఫ్లైట్‌ను సోమవారం నుంచి మళ్లీ పునరుద్ధరిస్తున్నారు. రాజమండ్రిలో సాయంత్రం బయలుదేరి హైద రాబాద్ వెళుతుంది. కారణాలేంటో తెలియదు కానీ.. రాజమండ్రి- న్యూఢిల్లీ మధ్య నడిసే ఫ్లైట్ సర్వీసు సోమవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ రద్దు చేశారు. ఇది ముందు గానే నిర్ణయించడం వల్ల టికెట్లు కూడా బుక్ చేయలేదని ఒక అధికారి చెప్పారు. ఈ నేప థ్యంలో తిరుపతి ఫ్లైట్‌తో రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వి మానాల సంఖ్య 10గా ఉంది. కానీ ఈ నెల 26వ తేదీ వరకూ ఢిల్లీ ఫ్లైట్ రద్దు కావడంతో 9 ఫ్లైట్లే ఉన్నట్టు లెక్క.
ఫ సోమవారం నుంచి ఈ నెల 26 వరకూ ఇండిగో విమానాల షెడ్యూల్ ప్రకటించా రు. ప్రతిరోజూ హైదరాబాద్‌లో ఉదయం 6.45కి బయలుదేరి రాజమండ్రికి 8 గంట లకు చేరుతుంది.తిరిగి 8.30కి బయలు దేరి 9.45కి హైదరాబాద్ వెళుతుంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో హైదరా బాద్‌లో 10.20కి బయలుదేరి 11.40కి రాజమండ్రి చేరుతుంది.రాజమండ్రిలో 12.05కి బయలుదేరి 1.25కి హైదరాబాద్ చేరుతుంది. హైదరాబాద్‌లో 1.55కి బయ లుదేరి 3.10కి రాజమండ్రి చేరుతుంది. రాజమండ్రిలో 3.30కి బయలుదేరి 4.45కి హైదరాబాద్ చేరుతుంది. హైద రాబా ద్‌లో సాయంత్రం 5.10కి బయలుదేరి 6.30కి రాజమండ్రి చేరుతుంది. తిరిగి రాజ మండ్రిలో 6.55కి బయలుదేరి రాత్రి 8.15కి హైదరాబాద్ చేరుతుంది. హైద రాబాద్‌లో రాత్రి 7.55కి బయలుదేరి 9.10కి రాజమండ్రి చేరుతుంది. రాజ మండ్రిలో 9.30కి బయలు దేరి 10.45కి హైదరాబాద్ చేరుతుంది.
ఫచెన్నైలో ఉదయం 10 గంటలకు బయలు దేరి 11.30 గంటలకు రాజమండ్రి చేరు తుంది.తిరిగి 12.15కి రాజమండ్రిలో బయ లుదేరి 1.35 గంటలకు చెన్నై చేరుతుంది.
ఫ ప్రతి మంగళ, గురు, శనివారం ముం బయిలో 4.15 గంటలకు బయలుదేరి సా యంత్రం 5.55కి రాజమండ్రి చేరుతుంది. రాజమండ్రిలో 6.25కి బయలుదేరి రాత్రి 8.15 గంటలకు ముంబయి చేరుతుంది.
ఫ బెంగళూరులో సాయంత్రం 4.50కి బయ లుదేరి 6.40కి రాజమండ్రి చేరు తుంది. రాజమండ్రిలో రాత్రి 7.15కి బయలు దేరి రాత్రి 9.10కి బెంగళూరు చేరుతుంది.