రాజమహేంద్రవరంలో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Mar 11 , 2026 | 01:47 AM
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్‌ప్లానింగ్)లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ విభాగాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టా
కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్‌లో
తనిఖీలు చేసిన అధికారులు
ఏసీబీ డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 20 మంది సిబ్బందితో మోహరింపు
686 పెండింగ్ ఫైళ్లు, ఆన్‌లైన్ లావాదేవీల డేటా పరిశీలన
కీలక సమాచారం స్వాధీనం
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 10 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్‌ప్లానింగ్)లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ విభాగాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం 11గంటలకు ఏసీబీ డీఎస్పీ కిషో ర్ కుమార్, సీఐలు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్‌లతో కలిసి మరో 20 మంది సిబ్బందితో టౌన్ ప్లానింగ్ వద్ద మోహరించారు. సిటీప్లానర్ జివిఎస్‌ఎన్.మూర్తి చాంబర్‌కు డీఎస్పీ కిషోర్‌కుమార్ చేరుకున్నారు. సీఐలు టౌన్‌ప్లానింగ్ విభాగంలో మిగిలిన అధికారులు, ఉద్యోగుల వద్దకు చేరుకు ని ఫైళ్లు పరిశీలించారు. అక్రమ కట్టడాలు, అను మతులు అతిక్రమించి భవ నిర్మాణాలు జరిగినట్టు పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతోనే ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఉదయం 11 ను ంచి రాత్రి 8 గంటల వరకు సోదాలు చేశారు. మధ్యలో భోజనానికి 20నిమిషాలు సమయం తీ సుకుని అటుపై మళ్లీ సోదాలు కొనసాగించారు. నగర పరిధిలో 25 జనవరి 2026 నుంచి ఇప్పటి వరకు భవన నిర్మాణాల అనుమతులకు సంబంఽధించి పెండింగ్‌లో ఉన్న, అప్రూవల్ అయ్యి పెం డింగ్‌లో ఉన్న 686 ఫైళ్లపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. ఏఏ ప్రాంతాలకు సం బంధించి భవనాల అనుమతులు తాజాగా ఇచ్చా రు. ఎన్ని పెండింగ్‌లో పెట్టారు, సచివాలయం నుంచి వచ్చిన 200 ఫైళ్ల పరిస్థితి ఏంటి? నిబంధనలు అతిక్రమించిన వాటి పరిస్థితిపై ఆరా తీ సినట్టు సమాచారం. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పెం డింగ్ ఫైళ్లు కూడా పరిశీలించారు. అదేవిధంగా గతంలో సిటీప్లానర్‌గా పనిచేసిన కోటయ్య హ యాంలో జరిగిన కొన్ని అవకతవకలపై ఆరా తీశారు. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు సంబంధిం చిన అంశాలపై వెరిఫికేషన్ చేశారు. సుమారు 9 గంటల పాటు సాగిన సోదాల్లో పలు కీలక ఫైళ్లు, ఆన్‌లైన్ లావాదేవీల వివరాలు ఏసీబీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు కంప్యూటర్లను పరిశీలన చేసి డేటాను పరిశీలించినట్టు సమాచారం. 2019-24, 2024 -26 ఏడాదికి సంబంధించిన భవన నిర్మాణాల అనుమతులు, పెండింగ్ దరఖాస్తులు అ న్నింటిని ఆరా తీశారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు హెడ్ ఆఫీస్ నుంచి వెలువతాయని, తాము ఇప్పుడు చెప్పేది ఏమి ఉండదని డీఎస్పీ కిషోర్‌కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఒకరిద్దరి టౌన్‌ప్లానింగ్ అధికారుల ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని తీసుకెళ్లినట్టు తెలిసింది. బుధవారం కూడా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.