Share News

కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Jan 31 , 2026 | 01:06 AM

కడియం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు జరిగిన సోదాల్లో రూ.1,82,210 అకౌంట్‌ లేని సొమ్ము ను గుర్తించారు. రెండో రోజు శుక్రవారం రిజిస్ట్రేషన్‌ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ర్టార్‌

కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సోదాలు చేస్తున్న అధికారులు

తక్కువ వాల్యూ రిజిస్ట్రేషన్‌తో 10 డాక్యుమెంట్లతో ప్రభుత్వానికి రూ.2,62,00,154 నష్టం

వెల్లడించిన డీఎస్పీ కిషోర్‌కుమార్‌

కడియం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కడియం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు జరిగిన సోదాల్లో రూ.1,82,210 అకౌంట్‌ లేని సొమ్ము ను గుర్తించారు. రెండో రోజు శుక్రవారం రిజిస్ట్రేషన్‌ శాఖ కాకినాడ జిల్లా రిజిస్ర్టార్‌(డీఆర్‌), డీఐ జీ, జిల్లా రిజిస్ర్టార్‌(ఆడిట్‌), ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ముందుగా డాక్యుమెంట్లు రైటర్ల నుంచి వివరాలతో స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. విచారణ అనంతరం డీఎస్పీ కిషోర్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు చేసిన డాక్యుమెంట్లులో 10 డాక్యుమెంట్లు తక్కువ విలువతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల రూ.2,62,00,154 ప్రభుత్వానికి నష్టం వచ్చినట్టు గుర్తించామన్నారు. సబ్‌రిజిస్ర్టార్‌ ఈ.లక్ష్మి గతంలో పనిచేసిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువ విలువతో చేయడం వల్ల రూ.95,46,330 ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు తమకు రిపోర్టులు వచ్చాయని తెలిపారు. 20 25లో 911 డాక్యుమెంట్లకు సరైన డాక్యుమెంట్లు పెట్టకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్టు విచారణలో తేలిందన్నారు. ఈనెల 28,29 తేదీల్లో కడియంలో 144 రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిలో 107 డాక్యుమెంట్లు ఇంకా పార్టీలకు డెలివరీ కాలేదని తెలిపారు. విచారణ కొనసాగిస్తున్నామన్నారు.

Updated Date - Jan 31 , 2026 | 01:06 AM