ఏసీబీ ఆకస్మిక దాడి
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:15 AM
కడియం సబ్ రిజిస్టార్ కార్యాలయంపై గురువారం రాత్రి 8-45 గంట లకు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు.
కడియం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం
రిజిస్ట్రేషన్లపై అధికారుల విచారణ
ఎవరైనా లంచం అడిగితే డయల్ 94404 46160
కడియం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి ఒకటి నుంచి భూముల ధరల పెరు గుదల నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. మా మూళ్ల మత్తులో రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. చేయి తడిపితే చాలు అడ్డే ఉండడంలేదు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు సమాచారం అందిందో ఏమో కానీ.. కడియం సబ్ రిజిస్టార్ కార్యాలయంపై గురువారం రాత్రి 8-45 గంట లకు ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. కడియం సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్‌గా ఈ.లక్ష్మి పనిచేస్తున్నారు. సబ్‌రిజిస్ర్టార్ చాంబర్ నుంచి రూ. 79 వేల నగదు, కార్యాలయం ఇతర చాంబర్ల నుంచి రూ. 1,03,210 నగదు మొత్తం రూ. 1,82,210 అకౌ ంట్ లేని సొమ్ము గుర్తించారు. అలానే ప్రొహిబిషన్ భూమి రిజిస్ట్రేషన్ జరిపారా ? ఇల్లీగల్ రిజిస్ట్రేషన్‌లు చేశారా ? అనే అం శాలను పరిశీలిస్తున్నామన్నారు.ఈ మేరకు విచారణ కొనసాగిస్తున్నట్టు ఏసీడీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ తెలిపారు.ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064, 94404 46160 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.