విజయవాడ-భోగాపురం విమానం మళ్లింపు
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:06 AM
విజయవాడ నుంచి భోగాపురం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు. బుధవారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరింది. రాత్రి 9.45 గంటలకు భోగాపురంలో ల్యాండ్ అయ్యేందుకు యత్నించినా ప్రతికూల వాతావరణంతో సాధ్యం కాలేదు.
వాతావరణం అనుకూలించక నాగ్‌పూర్‌కు..
ఫ్లైట్‌లో మంత్రులు అచ్చెన్న, కొండపల్లి, వైసీపీ నేత బొత్స తదితరులు
విజయనగరం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి భోగాపురం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించారు. బుధవారం రాత్రి 8.35 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరింది. రాత్రి 9.45 గంటలకు భోగాపురంలో ల్యాండ్ అయ్యేందుకు యత్నించినా ప్రతికూల వాతావరణంతో సాధ్యం కాలేదు. వర్షం వల్ల భోగాపురం సిగ్నల్ వ్యవస్థ పనిచేయక పోవడంతో విమానాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు మళ్లించారు. విమానంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఆయన కుమార్తె బొత్స అనూషతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, విశాఖపట్నం నాయకులు ఉన్నారు. నాగ్‌పూర్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు మంత్రులు తెలిపారు.