Share News

కనకదుర్గమ్మకు బంగారు కానుకలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:53 AM

కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు స్వర్ణ కానుకలు సమర్పించారు.

కనకదుర్గమ్మకు బంగారు కానుకలు
DURGAMATHA

  • 296.800 గ్రాముల కాసులపేరు, సూత్రాలు సమర్పించిన విజయవాడ భక్తులు

  • 63 గ్రాముల బంగారు హారాన్ని సమర్పించిన రాయచూర్‌ భక్తురాలు

ఇంద్రకీలాద్రి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు స్వర్ణ కానుకలు సమర్పించారు. విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన సీహెచ్‌ఎల్‌జీ ప్రసూనాంబ, సీహెచ్‌ జీఎ్‌సవీ ప్రసాద్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆలయానికి విచ్చేసి 192.500 గ్రాముల బరు వున్న బంగారు కాసులపేరు, 104.300 గ్రాముల బరువ ున్న బంగారు మంగళసూత్రాలను ఆలయ చైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌కు అందజేశారు. అలాగే కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన భక్తురాలు శిరీష సోమవారం దుర్గగుడికి వచ్చి 63 గ్రాముల నల్లపూసల బంగారు హారాన్ని దుర్గమ్మకు కానుకగా సమర్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం దాతలకు వేద ఆశీర్వచనం, శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, చిత్రపటాలను అందజేశారు.

Updated Date - Nov 17 , 2026 | 06:19 AM