Share News

అభివృద్ధి.. కూటమి మంత్రం

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:29 AM

రాష్ట్ర అభివృద్ధి కూటమి మంత్రంగా ముందుకు సాగుతుంటే, దానిని అడ్డుకోవడమే వైసీపీ తంత్రంగా వ్యవహరిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు విమర్శించారు

అభివృద్ధి.. కూటమి మంత్రం
dharmana

  • దానిని అడ్డుకోవడమే వైసీపీ తంత్రం

  • శ్రీకాకుళం ప్రచారంలో రామ్మోహన్‌నాయుడు, నాదెండ్ల

శ్రీకాకుళం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి కూటమి మంత్రంగా ముందుకు సాగుతుంటే, దానిని అడ్డుకోవడమే వైసీపీ తంత్రంగా వ్యవహరిస్తోందని పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. ఆదివారం ఆయన శ్రీకాకుళం నగరంలో పలు వార్డుల్లో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, కూటమి మేయర్‌ అభ్యర్థిని దానేటి రాధారాణితో కలసి విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో మళ్లీ సంక్షేమ పాలన అందుతోందని, అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ.. కూటమి మేయర్‌ అభ్యర్థిని, దానేటి శ్రీధర్‌ భార్య రాధారాణిని గెలిపించుకోవాల్సిన అవసరం విజ్ఞులైన శ్రీకాకుళం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న దానేటి శ్రీధర్‌కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ ప్రచారంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి, వంశీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 06:35 AM