Share News

అభిమానికి అందిన పవన్‌ బహుమతులు..!

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:16 AM

అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్‌ అడిగిన కోరికలను పవన్‌ కల్యాణ్‌ గంటల వ్యవధిలోనే తీర్చేశారు.

అభిమానికి అందిన పవన్‌ బహుమతులు..!

వరంగల్‌ కార్పొరేషన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పొనుగోటి నిరంజన్‌ అడిగిన కోరికలను పవన్‌ కల్యాణ్‌ గంటల వ్యవధిలోనే తీర్చేశారు. బుధవారం హనుమకొండలోని తమ ఇంటికి పరామర్శించడానికి వచ్చిన పవన్‌ను ఆడుకోడానికి ఒక కుక్క పిల్ల (పప్పీ)తో పాటు వీడియోలు, సినిమాలు చూడడానికి ఒక ట్యాబ్‌ కావాలని నిరంజన్‌ అడిగాడు. అదేరోజు రాత్రికి ఆయన టీం వాటిని తీసుకొచ్చి నిరంజన్‌కు అందజేసింది. పవన్‌కు నిరంజన్‌, అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 19 , 2026 | 04:17 AM