‘జోగి’ లైంగిక సామర్థ్య పరీక్షలపై 30న వాదనలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:41 AM
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను న్యాయస్థానం ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.
విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌కు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయాలని ఇబ్రహీంపట్నం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలను న్యాయస్థానం ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదుల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. వాదనలను న్యాయాధికారి 30వ తేదీకి వాయిదా వేశారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!