Share News

కానిస్టేబులే పోలీస్‌ బాస్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:32 AM

‘‘రోడ్డుపై నిలబడి విధులు నిర్వహించే కానిస్టేబులే అసలైన పోలీస్‌ బాస్‌.’’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణ కళాశాలలో శనివారం నిర్వహించిన 2025-26 బ్యాచ్‌ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.

కానిస్టేబులే పోలీస్‌ బాస్‌

  • అనంతలో కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌

  • పరేడ్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

అనంతపురం క్రైం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ‘‘రోడ్డుపై నిలబడి విధులు నిర్వహించే కానిస్టేబులే అసలైన పోలీస్‌ బాస్‌.’’ అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శిక్షణ కళాశాలలో శనివారం నిర్వహించిన 2025-26 బ్యాచ్‌ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. పీటీసీలో 683 మంది సివిల్‌ కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరు మంత్రి పయ్యావుల కేశవ్‌కు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖాకీ యూనిఫామ్‌ అధికారంతోపాటు బాధ్యతను కూడా పెంచుతుందన్నారు. పోలీసులను చూసి రౌడీలు, గూండాలు భయపడాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు. ప్రతి పోలీస్‌ యూనిఫాం వెనుక మంచి పోలీస్‌ ఉన్నాడనే విధంగా సమాజానికి బాధ్యతగా సేవ చేయాలని సూచించారు. పోలీసులు నిరంతరం అప్‌డేట్‌ అవుతూ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుని నేరస్థులను పట్టుకోవాలన్నారు. కన్నవాళ్లకు, రాష్ట్రంలో అతి పెద్ద బ్యాచ్‌ అనంతపురం నుంచి పాసింగ్‌ అవుట్‌ కావడం ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళక్లు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను అందించారు.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:32 AM