ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడనివ్వం: అచ్చెన్న
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:53 AM
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ రూ.5.19కు కొనుగోలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ.4.70కే కొనుగోలు చేస్తోందన్నారు.