ఓటమి భయంతోనే వైసీపీ దుష్ప్రచారం
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:43 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జి.శంకర్‌యాదవ్‌తో కలసి సొసైటీకాలనీలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి
మదనపల్లె, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జి.శంకర్‌యాదవ్‌తో కలసి సొసైటీకాలనీలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఓటమి భయంతో ఎన్నికలను ఎదుర్కోలేక కూటమిపై విమర్శలు చేస్తున్నట్లు చెప్పారు. మదనపల్లె మున్సిపాలిటీలో 48వార్డులకు గాను టీడీపీ 38, జనసేనకు ఆరు, బీజేపీకి నాలుగు స్థానాలు కేటాయించినట్లు వెల్లడించారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు, రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో బిహార్ నుంచి రౌడీలను రప్పించి విధ్వంసం సృష్టించింది వైసీపీ నేతలు కాదా అంటూ ప్రశ్నించారు. చేసిందంతా చేసి కూటమిపై నిందలు వేయడం భావ్యం కాదని హితవుపలికారు. స్వయంగా పోలీసులే రక్షణ కల్పిస్తూ వైసీపీ నేతలతో నామినేషన్లు వేయించారని గుర్తుచేశారు. సుగవాసి ప్రసాద్‌బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తుంటే ఏపీ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2021వ సంవత్సరంలో స్థానిక ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయో ప్రజలు చూశారని గుర్తుచేశారు. ఈ రోజు టీడీపీ కంటే వైసీపీ వాళ్లే ఎక్కువగా నామినేషన్లు వేశారంటే ప్రభుత్వం వారికి కల్పించిన భద్రత ఏంటో అర్థమవుతుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీతోపాటు జడ్పీటీసీ, ఎంసీటీసీ ఎన్నికల్లో బీసీలకు అధిక పాధాన్యం ఇచ్చామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జోనల్ ఇన్‌చార్జి దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.