Share News

పోలీసుల అదుపులో వైసీపీ నేత

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:20 AM

పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల కేసులో నిందితుడైన చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన వైసీపీ నేత, డీసీఎంస్‌ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

పోలీసుల అదుపులో వైసీపీ నేత

చంద్రగిరి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల కేసులో నిందితుడైన చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన వైసీపీ నేత, డీసీఎంస్‌ మాజీ చైర్మన్‌ సహదేవరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పుంగనూరులో హింసాత్మక దాడులపై ఎంపీ మిధున్‌రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరిలో సహదేవరెడ్డి కూడా వున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి సహదేవరెడ్డి పరారీలో ఉన్నాడు. బుధవారం బెంగళూరులో పోలీసులు సహదేవరెడ్డిని అదుపులోకి తీసుకుని, పుంగనూరుకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈనెల 23న చిన్నగొట్టిగల్లు మండలంలోని కురవపల్లెకు చెందిన టీడీపీ నేత, సింగిల్‌విండో చైర్మన్‌ ముత్తం ప్రభాకర్‌ కారు దగ్ధమైన కేసులో కూడా సహదేవరెడ్డి నిందితుడిగా ఉన్నాడు.

Updated Date - Oct 29 , 2026 | 01:20 AM