గుడిమల్లం ఆలయానికి య్యూట్యూబ్ భక్తి చానల్
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:14 AM
ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామి ఆలయ ఆధ్వర్యంలో యూట్యూబ్ భక్తిఛానల్‌ను బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు.
ఏర్పేడు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామి ఆలయ ఆధ్వర్యంలో యూట్యూబ్ భక్తిఛానల్‌ను బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. దేశంలోనే అతి ప్రాచీనమైన ఈ శివాలయం విశిష్టతను భక్తులకు తెలియజేయడానికి ఈ ఛానల్ ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఈవో రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, తహసీల్దారు భార్గవి, ఎంపీడీవో సౌభాగ్యం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, ఆలయ సమీపంలో సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘం సభ్యురాలు శశికళ ఏర్పాటు చేసిన నేటివ్ అరకు కాఫీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, అడిషనల్ పీడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.