దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:37 AM
దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పీఎం నరేంద్రమోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని మిట్స్ యూనివర్సిటీలో గురువారం ఎన్‌ఎ్‌సఎ్‌స, మై భారత్ విభాగాల ఆధ్వర్యంలో ఖేలో ఇండియా-ఖేల్ కి బాత్ విత్ పీఎం మోదీ వర్చువల్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కురబలకోట, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి) : దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పీఎం నరేంద్రమోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మండలంలోని మిట్స్ యూనివర్సిటీలో గురువారం ఎన్‌ఎ్‌సఎ్‌స, మై భారత్ విభాగాల ఆధ్వర్యంలో ఖేలో ఇండియా-ఖేల్ కి బాత్ విత్ పీఎం మోదీ వర్చువల్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఎం మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ 2047లో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. మై భారత్ వేదిక ద్వారా యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడమేగాక దేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ర్టార్ ప్రదీ్‌పకుమార్, వాలీబాల్ సౌత్‌జోన్ క్రీడాకారుడు సిద్ధార్థ్, బాస్కెట్ బాల్ సౌత్‌జోన్ క్రీడాకారిణి వైష్ణవి, రాజ్‌కుమార్, వెంకటేశ్వర్లు, దామోదరన్, రాజేష్ పాల్గొన్నారు.