పిడుగుపడి యువకుడి మృతి
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:47 AM
పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన అతావుల్లా కుమారుడు మాలిక్ కురబలకోట కదిరి రోడ్డులోని పొలంలో భూమిని చదును చేయిస్తున్నాడు.
కురబలకోట, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి) : పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన అతావుల్లా కుమారుడు మాలిక్ కురబలకోట కదిరి రోడ్డులోని పొలంలో భూమిని చదును చేయిస్తున్నాడు. సాయంత్రం ఆ ప్రాంతంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు చూసి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.