Share News

ఆన్‌లైన్‌ బెట్టింగులకు యువకుడి బలి

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:00 AM

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు యువకుడు బలయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దేవళచెరువు పంచాయతీ నీరుగట్టువారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు అనీల్‌కుమార్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు.

ఆన్‌లైన్‌ బెట్టింగులకు యువకుడి బలి
అనీల్‌కుమార్‌(ఫైల్‌ ఫొటో)

ములకలచెరువు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు యువకుడు బలయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దేవళచెరువు పంచాయతీ నీరుగట్టువారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు అనీల్‌కుమార్‌ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. గుంటూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగులకు అలవాటుపడ్డాడు. ఇందులో భాగంగా అప్పులు చేశాడు. కుటుంబీకుల నుంచి నగదు తీసుకుని బెట్టింగులు ఆడి పోగొట్టాడు. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురై ఈనెల 11వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి స్విమ్స్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రతాప్‌ తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 01:00 AM