Share News

రెచ్చగొడుతున్న వైసీపీ!

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:32 AM

‘ప్రశాంత కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది’ అనేది టీడీపీ నేతల అనుమానం.. ఆరోపణ. దీనికి బలం చేకూర్చేలా మంగళవారం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ భరత్‌ వ్యాఖ్యలున్నాయి. ‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలి. రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తాం. వైసీపీ కోసం వైఎస్సార్‌ పార్టీకోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండే క్యాండిడేట్స్‌ను సిద్ధం చేస్తాం’ అంటూ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

రెచ్చగొడుతున్న వైసీపీ!
ఎస్‌ఐ బాబుకు ఫిర్యాదు అందజేస్తున్న టీడీపీ నేతలు

పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై విమర్శలు

భరత్‌పై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతల ఫిర్యాదులు

కుప్పం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘ప్రశాంత కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది’ అనేది టీడీపీ నేతల అనుమానం.. ఆరోపణ. దీనికి బలం చేకూర్చేలా మంగళవారం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ భరత్‌ వ్యాఖ్యలున్నాయి. ‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలి. రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తాం. వైసీపీ కోసం వైఎస్సార్‌ పార్టీకోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండే క్యాండిడేట్స్‌ను సిద్ధం చేస్తాం’ అంటూ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత కుప్పంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసిన అరాచకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో మాజీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబును కుప్పం పర్యటనను పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో చంద్రబాబు కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో ధర్నాకు దిగారు. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదేస్థాయిలో కుట్రలు చేస్తూ, చేస్తున్నారంటూ.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని సోమవారం ప్రకటించారు కూడా. అయితే పెద్దిరెడ్డి కుప్పం పర్యటన రద్దయింది. ముందుగా నిర్ణయించిన కల్యాణ మండపానికి బదులు కుప్పంలోని ఎమ్మెల్సీ ఇంటివద్ద సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఇలా భరత్‌ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ తీవ్రంగా స్పందించింది.

ఎమ్మెల్సీ భరత్‌పై చర్యలు తీసుకోండి

పోలీసులకు టీడీపీ ఫిర్యాదు

పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కుప్పం టీడీపీ శ్రేణులు డిమాండ్‌ చేశాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా, స్థానిక ఎన్నికలను ప్రభావితం చేసేలా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారన్నారు. ఈ మేరకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కుప్పం అర్బన్‌ ఎస్‌ఐ బాబుకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. టీడీపీ కుప్పం మండలం, మున్సిపల్‌ అధ్యక్షులు ఎం.రాజగోపాల్‌, కాణిపాకం వెంకటేష్‌, కడా పీఏసీ సభ్యుడు రాజ్‌ కుమార్‌, ఏపీఐఐసీ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు నందిగం ఉదయ్‌ కుమార్‌, రాష్ట్రలేబర్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ భాష్యం విశ్వనాథ్‌ నాయుడు తదితరులు రాళ్లబూదుగూరు పోలీస్‌ స్టేషన్‌లోనూ ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేశారు.

రామకుప్పం, ఆంధ్రజ్యోతి: కుప్పంలో జరిగిన వైసీపీ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్‌, జడ్పీచైర్మన్‌ శ్రీనివాసులు రెచ్చగొట్టేలా ప్రసంగించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ గ్రంథాలయ పరిషత్‌ డైరెక్టర్‌ మునస్వామి, టీడీపీ జిల్లా కార్యదర్శి పట్రనారాయణాచారి, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వెంకటరమణ, కామరాజనాయక్‌, మాజీ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, ఆనందరెడ్డి తదితరులు సీఐ మల్లే్‌షయాదవ్‌, ఎస్‌ఐ మారెప్పకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి సూచనలతో వీరు కుప్పంలో అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - Sep 09 , 2026 | 01:32 AM