మత్స్యకారుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - May 20 , 2026 | 02:09 AM
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘మత్స్యకారుల సేవలో..’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన జాలర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోందని చెప్పారు. జిల్లాలో 3,099మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.6.19కోట్లు జమ చేసినట్లు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సూపర్ సిక్స్‌లోని హామీలన్నీ నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.
- ‘మత్స్యకార సేవలో..’ కింద
3,099 మందికి రూ.6.19కోట్ల లబ్ధి
- మంత్రి అనగాని సత్యప్రసాద్
తిరుపతి(కలెక్టరేట్), మే 19 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘మత్స్యకారుల సేవలో..’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన జాలర్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోందని చెప్పారు. జిల్లాలో 3,099మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.6.19కోట్లు జమ చేసినట్లు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సూపర్ సిక్స్‌లోని హామీలన్నీ నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి అనేక సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. చేపల ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయించడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ట్రాన్స్‌ఫాండర్లు, బోట్లు, నెట్లు, ఎరేటర్లు తదితర పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర జలాల్లోకి తమిళ జాలర్లు ప్రవేశించకుండా పకడ్బందీ తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, తమిళనాడు అక్రమ బోట్లను అరికట్టేందుకు సీఎం ఆదేశాలతో జిల్లాకు రెండు హైస్పీడ్ బోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, తమిళ జాలర్ల కట్టడికి మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులతో కలిసి గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ, తూపిలిపాళెంలో పిష్ ల్యాండింగ్ సెంటర్‌కు నిధులు మంజూరు అయ్యాయన్నారు. చంద్రగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, రామకృష్ణ, బొజ్జల సుధీర్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ, మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అనంతరం మత్స్యకారులకు మెగా చెక్కును, వలలను అందజేశారు. జేసీ గోవిందరావు, కార్పొరేషన్ల చైర్మన్లు రుద్రకోటి సదాశివం, పసుపులేటి హరిప్రసాద్, సీఆర్ రాజన్, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి, డీఆర్వో నరసింహులు, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.