మహిళల భద్రతకు పెద్దపీట
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:58 AM
మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకువాలన్నారు.
- అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు
- కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్
మదనపల్లె అర్బన్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకువాలన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన పోలీసు అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. డీఐజీ మాట్లాడుతూ మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ పెట్టే పోస్టింగ్‌లపై దృష్టి సారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి భద్రతా ప్రమాణాలను పాటించాలని పేర్కొన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఎస్పీ ధీరజ్‌తో కలిసి ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఏఎస్పీ వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ పావని, పలువురు సీఐలు పాల్గొన్నారు.