రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన మహిళ
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:47 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మతిస్థితిమితం కోల్పోయింది. తిరుపతికి చెందిన ఉమాశంకర్ తన భార్య నీరజ, పిల్లలు శాన్విక(9), చార్వీశ్రీ(5)తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం సోమవారం వచ్చారు.
శ్రీకాళహస్తి రూరల్, జూన్ 4(ఆంఽధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మతిస్థితిమితం కోల్పోయింది. తిరుపతికి చెందిన ఉమాశంకర్ తన భార్య నీరజ, పిల్లలు శాన్విక(9), చార్వీశ్రీ(5)తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనార్థం సోమవారం వచ్చారు. రాత్రి తిరుగు ప్రయాణంలో కోకోకోలా కర్మాగారం సమీపంలో వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టి వెళ్లింది. బైక్ కింద పడిపోయింది. అందరూ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తర లించారు. ఉమాశంకర్ చేతికి తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ చేశారు. శాన్విక, చార్వీశ్రీలకు స్వల్పగాయాల య్యాయి. భార్య నీరజ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదంలో తలకు దెబ్బ తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. గురువారం స్పృహలోకి వచ్చిన ఆమె ఎవరినీ గుర్తు పట్టడంలేదు. కన్నబిడ్డలు ఎదురుగా నిల్చున్నా ఎవరో తెలియదు అని చెప్పడంతో కుటుంబసభ్యులు భోరున విలపించారు. రూరల్ సీఐ ఇబ్రహీం కేసు నమోదు చేశారు.