Share News

గూడు లేక..మరో దారిలేక

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:41 AM

నాయుడుపేట పట్టణం పాత బస్టాండ్‌ వద్ద డివైడర్లపైన నక్కలోళ్లు గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒకరైన వెంకటేశ్వర్లు(60) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు.

గూడు లేక..మరో దారిలేక
రోడ్డుపై మృతదేహాన్ని పెట్టి నివాళులర్పిస్తున్న బంధువులు

నాయుడుపేట టౌన్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేట పట్టణం పాత బస్టాండ్‌ వద్ద డివైడర్లపైన నక్కలోళ్లు గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒకరైన వెంకటేశ్వర్లు(60) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. ఇతర ప్రాంతాల నుంచి బంధువులు రావాల్సి ఉండడంతో శనివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎవరికీ స్థిర నివాసాలు లేకపోవడంతో మృతదేహాన్ని రోడ్డుపైనే పెట్టారు. అక్కడే పూలమాలలు వేసి నివాళులర్పిస్తుండడం అందరినీ కలచివేసింది.

Updated Date - Aug 22 , 2026 | 12:41 AM