Share News

10మంది జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

ABN , Publish Date - Oct 27 , 2026 | 02:02 AM

పరిషత్తు ఎన్నికల ప్రక్రియలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనుంది. జిల్లాలో 35జడ్పీటీసీ, 444 ఎంపీటీసీ స్థానాలకు పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు

10మంది జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి):పరిషత్తు ఎన్నికల ప్రక్రియలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నంతో ముగియనుంది. జిల్లాలో 35జడ్పీటీసీ, 444 ఎంపీటీసీ స్థానాలకు పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ఒకే పార్టీకి చెందిన వారు నలుగురు, ఐదుగురు చొప్పున నామినేషన్లు దాఖలుచేశారు. అయితే బీఫారం ఒకరికే ఇవ్వనుండడంతో మిగిలిన వారు ఉపసంహరించుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల లోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తరువాత ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థులు తుది జాబితా ప్రకటించడంతోపాటు వారికి గుర్తులు కూడా కేటాయించనున్నారు.కాగా సోమవారం ఆరు మండలాలకు చెందిన పదిమంది జడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ముగ్గురు వున్నారు. చిట్టమూరునుంచి వైసీపీ అభ్యర్థులు చెన్నారెడ్డి శిరీష, చెన్నారెడ్డి ప్రసూన, నారాయణవనంలో వఇద్దరు టీడీపీ అభ్యర్థులు మహేష్‌, సుబ్రహ్మణ్యం, ఓజిలి నుంచి టీడీపీ అభ్యర్థి తుపాకుల మునెమ్మ, పిచ్చాటూరులో వైసీపీ నుంచి వెట్టి సరళ,జి.సుగుణ, జి.జోన, వరదయ్యపాళెం నుంచి వైసీపీ అభ్యర్థి కన్నలి వెంకటయ్య, ఎర్రావారిపాళెం వైసీపీ అభ్యర్థి ఊటుకూరు భాగ్యలక్ష్మి నామినేషన్లను ఉపసంహరించుకున్న వారిలో వున్నారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఉపసంహరణపై మంగళవారం స్పష్టత రానుందని జడ్పీసీఈవో శోభన్‌బాబు తెలిపారు.

Updated Date - Oct 27 , 2026 | 02:02 AM