డీయూ-2023 అధ్యాపక నోటిఫికేషన్ల ఉపసంహరణ
ABN , Publish Date - May 08 , 2026 | 01:37 AM
ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 24 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 అక్టోబరు 30న జారీ చేసిన నాలుగు అధ్యాపక నియామక నోటిఫికేషన్లనూ ఉపసంహరించుకున్నట్లు ఆయన గురువారం పేర్కొన్నారు. ఆ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, దరఖాస్తు రుసుము తిరిగి పొందేందుకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ‘ద్రవిడియన్‌యూనివర్శిటీ.ఎసి.ఇన్’ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని రిజిస్ట్రార్ సూచించారు.
కుప్పం, మే 7 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 24 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 అక్టోబరు 30న జారీ చేసిన నాలుగు అధ్యాపక నియామక నోటిఫికేషన్లనూ ఉపసంహరించుకున్నట్లు ఆయన గురువారం పేర్కొన్నారు. ఆ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, దరఖాస్తు రుసుము తిరిగి పొందేందుకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ‘ద్రవిడియన్‌యూనివర్శిటీ.ఎసి.ఇన్’ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని రిజిస్ట్రార్ సూచించారు.