Share News

గొంతెండి...అడవిని వీడి..

ABN , Publish Date - Aug 14 , 2026 | 02:44 AM

వర్షాభావానికి అడవి జంతువులు అల్లాడిపోతున్నాయి. కనుచూపు మేర నీరు లేక దాహం తీరేదారి లేక అలమటిస్తున్నాయి. ఎల్‌నీనో ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా అడవుల్లోని జల వనరులు ఒట్టిపోయాయి. వేసవి తర్వాత ఎల్‌నీనో ప్రభావంతో జూన్‌ నుంచి ఇప్పటికి వరకు పెద్దగా వర్షాలు పడటంలేదు. దీంతో ఆడవుల్లో తాగునీటికి, మేతకు కొరత ఏర్పడటంతో అడవి జంతువులు క్టిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

గొంతెండి...అడవిని వీడి..
కనుగొండ అటవీప్రాంతంలో చుక్కనీరు లేని తురపాపికుంట

ములకలచెరువు,ఆంధ్రజ్యోతి: వర్షాభావానికి అడవి జంతువులు అల్లాడిపోతున్నాయి. కనుచూపు మేర నీరు లేక దాహం తీరేదారి లేక అలమటిస్తున్నాయి. ఎల్‌నీనో ప్రభావంతో మునుపెన్నడూ లేని విధంగా అడవుల్లోని జల వనరులు ఒట్టిపోయాయి. వేసవి తర్వాత ఎల్‌నీనో ప్రభావంతో జూన్‌ నుంచి ఇప్పటికి వరకు పెద్దగా వర్షాలు పడటంలేదు. దీంతో ఆడవుల్లో తాగునీటికి, మేతకు కొరత ఏర్పడటంతో అడవి జంతువులు క్టిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. నీరు, మేత కోసం జనారణ్య బాట పడుతున్నాయి. ఈక్రమంలో ఇబ్బంది పడుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో కనుగొండ, నల్లగొండ, నేరేడుకొండ, సండ్రడివి, మల్లయ్యకొండ, ఇనుముకొండ, సాధుకొండ, బెట్టకొండ, అక్కమల్లమ్మ కొండ, హార్సీలీహిల్స్‌, తెట్టు, కురబలకోట పరిధిలోని వేలాది ఎకరాల్లో రిజర్వు ఆడవులు ఉన్నాయి. ఇక్కడ జింకలు, నెమళ్లు, అడవి పందులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ములకలచెరువు, పెద్దతిప్పముద్రం, బి.కొత్తకోట మండలాల్లో నెమళ్లు, జింకలు భారగీ సంఖ్యలో ఉన్నాయి. జంతువుల కోసం కుంటలు, చెలమలు, డోనలు, సాసర పిట్‌లు, నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరడంతో జల వనరులన్నీ ఎండిపోయాయి. వేపవి తరువాత కూడా వర్షాలు కురవడంలేదు.

పల్లెల్లో బిక్కుబిక్కుమంటూ...

దిక్కుతోచని పరిస్థితుల్లో జంతువులు నీరు, మేత వెతుక్కుంటూ అటవీ శివారు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణ జింకలు, జింకలు రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. గ్రామాల్లోకి వస్తున్న జింకలపై కుక్కలు దాడి చేసి చంపేస్తున్నాయి. నెమళ్లు గ్రామాల్లోనే ఉంటూ అక్కడి ప్రజలు పెట్టిన తిండి, నీరుతో ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. ములకలచెరువు మండలం రామానాయునికోటకు రెండు నెలల క్రితం వచ్చిన నెమలిని కుక్క దాడి చేసి చంపేసింది. ఇదే ఊరిలో కొద్ది రోజులుగా మరో నెమలి ఉంటోంది. ఇలా నెమళ్లు గ్రామాల బాట పడుతున్నాయి.

నీటి కొరత లేకుండా చర్యలు : సైదులు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

వర్షాభావ పరిస్ధితులు నెలకొనడంతో అడవుల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. హార్సిలీహిల్స్‌, వేపూరికోట బీట్‌ల్లో వారానికి ఒకసారి సాసర పిట్లు, తొట్టెల్లో సిబ్బంది నీరు తెచ్చి నింపుతున్నారు. అడవుల్లోని సాపర పిట్లు, తొట్టెల్లో నీరు అయిపోయిన వెంటనే నింపాలని ఆదేశించాం. ఆకస్మిక తనిఖీ చేస్తున్నాం జంతువులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 14 , 2026 | 02:52 AM